Ritika Phogat: ఆత్మహత్య చేసుకున్న జూనియర్ రెజ్లర్ ఫోగట్

జూనియర్‌ స్థాయి రెజ్లింగ్‌ క్రీడాకారిణి, స్టార్‌ రెజ్లర్‌ ఫొగట్‌ సిస్టర్స్ రిలేషన్ రితికా ఫొగట్‌ అనుమానాస్పద స్థితిలో మరణించింది. రాజస్థాన్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ఓటమితో ఆమె షాక్‌కు గురైందని చెబుతున్నారు.

Ritika Phogat Suicide

Ritika Phogat: జూనియర్‌ స్థాయి రెజ్లింగ్‌ క్రీడాకారిణి, స్టార్‌ రెజ్లర్‌ ఫొగట్‌ సిస్టర్స్ రిలేషన్ రితికా ఫొగట్‌ అనుమానాస్పద స్థితిలో మరణించింది. రాజస్థాన్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ఓటమితో ఆమె షాక్‌కు గురైందని చెబుతున్నారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని హరియాణా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బబితా ఫోగాట్ బంధువు రితికా మార్చి 17 న ఆత్మహత్య చేసుకున్నారు. రాజస్థాన్‌లో జరిగే రెజ్లింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి రితికా వెళ్లినట్లు చార్కి దాద్రి డీఎస్పీ రామ్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. రితికా అక్కడ ఓడిపోయింది.

ప్రముఖ రెజ్లర్లు గీతా, బబితా ఫొగట్‌ కజిన్‌ అయిన 17ఏళ్ల రితిక.. మహవీర్‌ ఫొగట్‌ స్పోర్ట్స్ అకాడమీలో రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల భరత్‌పూర్‌లో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్రస్థాయిలో సబ్‌ జూనియర్‌, జూనియర్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ఆమె పాల్గొంది. ఈ టోర్నీలో ఫైనల్‌ వరకు చేరిన రితిక.. తుది పోటీలో కేవలం ఒకే ఒక్క పాయింట్‌తో ఓటమి చవిచూసింది.

అప్పటి నుంచి తీవ్ర కుంగుబాటుకు లోనైన ఆమె.. బుధవారం రాత్రి మహవీర్‌సింగ్‌ ఫొగట్ నివాసంలోనే తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. టోర్నీలో ఓటమితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. రితిక మరణంతో ఫొగట్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. రాజస్థాన్‌లో జరిగిన ఆ టోర్నమెంట్‌లో ఓటమికి మరణం వెనుక కూడా కారణం ఉండవచ్చని బిష్ణోయ్ అన్నారు.