Yuvraj Samra creates history became Youngest to score a hundred in T20 worldcup history
T20 World Cup 2026 : కెనడా బ్యాటర్ యువరాజ్ సమ్రా అరుదైన ఘనత సాధించాడు. చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో అతడు టీ20 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ కు చెందిన అహ్మద్ షెహజాద్ పేరిట ఉండేది. అహ్మద్ షెహజాద్ 2014లో బంగ్లాదేశ్ పై 22 ఏళ్ల 127 రోజుల వయసులో సెంచరీ చేయగా.. యువీ 19 ఏళ్ల 141 రోజుల వయసులోనే మూడు అంకెల స్కోరు సాధించాడు.
YOUNGEST BATTER TO SCORE HUNDRED IN T20 WC.
FIRST ASSOCIATE BATTER TO SCORE HUNDRED IN T20 WC.
ONE & ONLY YUVRAJ SAMRA 🥶 pic.twitter.com/T2sRvKk4cg
— Johns. (@CricCrazyJohns) February 17, 2026
ఈ మ్యాచ్‌లో యువరాజ్ సమ్రా 65 బంతులు ఎదుర్కొన్నాడు. 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ ఏజ్‌లో సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..
* యువరాజ్ సమ్రా (కెనడా) – 2026లో న్యూజిలాండ్ పై – 19 ఏళ్ల 141 రోజులు
* అహ్మద్ షెహజాద్ (పాకిస్థాన్) – 2014లో బంగ్లాదేశ్ పై – 22 ఏళ్ల 127 రోజులు
* సురేశ్ రైనా (భారత్) – 2010లో దక్షిణాఫ్రికాపై – 23 ఏళ్ల 156 రోజులు
* అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్) – 2014లో శ్రీలంకపై – 25 ఏళ్ల 83 రోజులు
* గ్లెన్ ఫిలిఫ్స్ (న్యూజిలాండ్) – 2022లో శ్రీలంకపై – 25 ఏళ్ల 327 రోజులు