Best Affordable Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ ఏప్రిల్‌లో రూ. 45వేల లోపు 6 బెస్ట్ సరసమైన ఫోన్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?

Best Affordable Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ ఏప్రిల్ 2026లో రూ. 45వేల లోపు ధరలో 6 బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best Affordable Phones

  • రూ. 45వేల లోపు ధరలో 6 బెస్ట్ సరసమైన ఫోన్లు ఇవే
  • మోటోరోలా నుంచి శాంసంగ్ గెలాక్సీ వరకు ఫుల్ లిస్టు
  • పవర్ ఫుల్ బ్యాటరీలతో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆప్షన్లు

Best Affordable Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీరు మంచి కెమెరాలతో పాటు అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అందించే ఫోన్ల కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలో లభించే అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

అదిరే బ్యాటరీలతో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఈ ఏప్రిల్ నెలలో రూ. 45వేల లోపు ధరలో లభించే 6 బెస్ట్ సరసమైన ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ (రూ. 30,098) :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీలో 50MP + 10MP + 50MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమన్షిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ యూనిట్‌లో 1B కలర్లు, 120Hz రిఫ్రెష్ రేట్ 6000mAh బ్యాటరీ సపోర్ట్‌తో 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లే ఉంది.

పోకో X8 ప్రో మాక్స్ (రూ. 42,999) :
పోకో X8 ప్రో మ్యాక్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌తో రన్ అవుతోంది. హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది. కెమెరాల విషయానికొస్తే.. 50MP + 8MP రియర్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 68 బిలియన్ కలర్లు, 120Hz రిఫ్రెష్ రేట్ 3500-నిట్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. చివరగా, 8500mAh బ్యాటరీ, 100W ఛార్జర్ ఉన్నాయి.

Read Also : Apple Intelligence : ఐఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన ఫీచర్.. ఈ కొత్త AI ఫీచర్.. ఫుడ్ నుంచి టికెట్ల వరకు అన్నీ స్కాన్ చేస్తుంది..!

ఐక్యూ 15R (రూ. 44,999) :
ఐక్యూ 15Rలో ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 144Hz రిఫ్రెష్ రేట్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో ఈ యూనిట్, ఆరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. 7600mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో 50MP + 8MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

వన్‌ప్లస్ 13R (రూ. 41,998) :
వన్‌ప్లస్ 13R స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పాటు ఆక్సిజన్‌ఓఎస్ 15తో రన్ అవుతుంది. 50MP + 50MP + 8MP రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ 6000mAh బ్యాటరీతో 6.78-అంగుళాల ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది.

వివో వి70 FE (రూ. 37,999) :
వివో V70 ఎఫ్ఈలో 200MP + 8MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఒరిజిన్OS 6పై మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్ 7000mAh బ్యాటరీ సపోర్ట్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కూడా అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 5G (రూ. 44,999) :
ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీలో 50MP + 10MP + 12MP రియర్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. వన్ యూఐ 8.0పై రన్ అవుతుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ 2600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.2-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది.