Best 5G Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 15వేల లోపు 7 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా..?

Best 5G Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కావాలా? శాంసంగ్, ఒప్పో, వివో ఫోన్లలో మీ ఫేవరెట్ ఫోన్ ఏంటి? రూ. 15వేల లోపు ధరలో 7 అద్భుతమైన ఫోన్లు ఉన్నాయి.. ఏది కొంటారో కొనేసుకోండి.

Best 5G Phones April 2026

  • రూ. 15వేల లోపు ధరలో బిగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం
  • ఆకట్టుకునేలా బ్యాటరీ, కెమెరాలు, డిస్‌ప్లే, ప్రాసెసర్
  • ధర కూడా రూ. 12వేల నుంచి రూ. 14వేల మధ్య రేంజ్

Best 5G Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలలో మీరు రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్ కొనాలని అనుకుంటే ఇది మీకోసమే.

శాంసంగ్, ఒప్పో, వివో ఫోన్లలో చాలావరకూ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి. కెమెరా క్వాలిటీ కూడా అద్భుతంగా ఉన్నాయి. లాంగక బ్యాటరీ లైఫ్‌ అందించే ఈ సూపర్ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

వివో టీ4 లైట్ (రూ. 12,899) :
వివో టీ4 లైట్ 5జీలో డ్యూయల్ 50ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. ఫన్‌టచ్ 15పై రన్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పవర్ పొందుతుంది.

శాంసంగ్ గెలాక్సీ M06 (రూ. 12,999) :
శాంసంగ్ గెలాక్సీ M06 5జీ ఫోన్ డ్యూయల్ 50MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. వన్ యూఐ కోర్ 7.0పై రన్ అవుతుంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల పీఎల్ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ ఉన్నాయి.

Read Also : Realme 16 5G : రియల్‌మి క్రేజే వేరబ్బా.. ఈ సెల్ఫీ మిర్రర్ 5G ఫోన్ భలే ఉందిగా.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

ఐక్యూ Z10 లైట్ (రూ. 14,999) :
ఐక్యూ Z10 లైట్ 5జీలో డ్యూయల్ 50MP రియర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫన్‌టచ్ 15పై రన్ అవుతుంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ ఉన్నాయి.

రెడ్‌మి A4 5జీ (రూ. 11,999):
రెడ్‌మి A4 5జీలో 50MP రియర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. హైపర్‌ఓఎస్‌పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 5160mAh బ్యాటరీ ఉన్నాయి.

పోకో ఎం7 (రూ. 13,497) :
పోకో M7 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4వ జనరేషన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. హైపర్‌ఓఎస్‌పై రన్ అవుతుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 50MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ యూనిట్ 5160mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది.

మోటోరోలా జీ35 5జీ (రూ. 13,999) :
మోటోరోలా G35 5జీ ఫోన్ డ్యూయల్ కెమెరా (50MP + 8MP), 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. యూనిసోక్ T760 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మోటోరోలా 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది.

ఒప్పో K14x (రూ. 14,460) :
ఒప్పో కె14ఎక్స్ 5జీలో డ్యూయల్ 50MP రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. కలర్‌ఓఎస్ 15పై రన్ అవుతుంది. ఈ యూనిట్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ ఉన్నాయి.