Best Recharge Plans : నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? మీ నెట్‌వర్క్ ఏదైనా 7 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!

Best Recharge Plans : మొబైల్ వినియోగదారులకు అలర్ట్.. నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? మీది జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా ఏదైనా సరే.. ఈ 7 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం.. ఓసారి లుక్కేయండి.

Best Recharge Plans

Best Recharge Plans : మీకు మొబైల్ డేటా అవసరం లేదా? కాలింగ్ బెనిఫిట్స్, ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలా? అయితే, మీకోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించి 7 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీకు ఎక్కువ డేటా అవసరం లేకపోతే కాల్ చేసేందుకు మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం. మీకు జియో, ఎయిర్‌టెల్, Vi, BSNL ప్లాన్లలో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోండి.

Read Also : Motorola Edge 60 Pro : మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో వచ్చేసిందోచ్.. ట్రిపుల్ కెమెరాలు హైలెట్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

1. ఎయిర్‌టెల్ రూ. 1849 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎయిర్‌టెల్ వాయిస్, SMS ఓన్లీ ప్లాన్. ఇందులో డేటా అందుబాటులో లేదు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు మొత్తం 3600 SMS అందిస్తుంది. ఈ ప్లాన్‌లో స్పామ్ కాల్, SMS అలర్ట్స్, అపోలో 24/7 సర్కిల్, ఫ్రీ హెలోట్యూన్స్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.

2. ఎయిర్‌టెల్ రూ.469 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎయిర్‌టెల్ వాయిస్, SMS ఓన్లీ ప్లాన్. ఇందులో డేటా లేదు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు మొత్తం 900 SMS అందిస్తుంది. ఈ ప్లాన్‌లో స్పామ్ కాల్, SMS అలర్ట్స్, అపోలో 24/7 సర్కిల్, ఫ్రీ హెలోట్యూన్స్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.

3. జియో రూ. 1748 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. జియో వాయిస్, SMS ఓన్లీ ప్లాన్. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు మొత్తం 3600 SMS అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.

4. జియో రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. జియో వాయిస్, SMS ఓన్లీ ప్లాన్. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు మొత్తం వెయ్యి SMS అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.

5. వోడాఫోన్ ఐడియా రూ. 1849 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వోడాఫోన్ ఐడియా వాయిస్, SMS ఓన్లీ ప్లాన్. డేటాను అందించదు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు మొత్తం 3600 SMS అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ పొందలేరు.

Read Also : UPI New Rules : యూపీఐ కొత్త రూల్స్.. యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇకపై పొరపాటున కూడా డబ్బులు రాంగ్ పర్సన్‌కు పంపలేరు..!

6. వోడాఫోన్ ఐడియా రూ. 470 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. VI నుంచి వాయిస్, SMS ఓన్లీ ప్లాన్. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు మొత్తం 900 SMS అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ అందించలేదు.

7. BSNL రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ అన్‌‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS అందిస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటాను కూడా అందిస్తుంది. 24GB క్యాపింగ్‌తో వస్తుంది. 24GB అయిపోయిన తర్వాత కూడా మీరు 40Kbps స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు.