Airtel Cheapest Plan : ఎయిర్‌టెల్ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 60 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు డేటా ఎంతంటే?

Airtel Cheapest Plan : ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ అతి తక్కువ ధరకే.. 60 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్, 1.5GB డేటా పొందవచ్చు.

Airtel Cheapest Plan : ఎయిర్‌టెల్ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 60 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు డేటా ఎంతంటే?

Airtel Roaming Plan

Updated On : July 15, 2025 / 5:24 PM IST

Airtel Cheapest Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎయిర్‌టెల్ సరసమైన ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. తాజాగా కస్టమర్ల కోసం మరో సరికొత్త (Airtel Cheapest Plan) ప్లాన్ కూడా తీసుకొచ్చింది. బడ్జెట్‌ ధరలో రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తుంటే ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. 60 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో ఎంటర్‌టైన్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

ఎయిర్‌టెల్ రూ. 619 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.619 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు 60 రోజుల వరకు అనేక బెనిఫిట్స్ అందుతాయి. ఏ నెట్‌వర్క్‌లోనైనా మాట్లాడేందుకు అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు భారత్ అంతటా ఫ్రీ నేషనల్ రోమింగ్ నుంచి ప్రయోజనం పొందవచ్చు.

Read Also : Realme 15 Pro 5G : 50MP మెయిన్ రియర్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌‌తో రియల్‌మి 15 ప్రో 5G.. లాంచ్ ఎప్పుడంటే?

అదనంగా, ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఫ్రీ యాప్స్‌కు సబ్‌స్ర్కిప్షన్ పొందుతారు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే (Airtel Xstream Play)కి ఫ్రీ యాక్సెస్ కూడా పొందవచ్చు. మీరు ప్రతి 30 రోజులకు ఏదైనా ఒక ట్యూన్ ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రీమ్ ప్లే యాక్సెస్ ఉన్న వినియోగదారులు తమకు ఇష్టమైన అన్ని టీవీ షోలు, మూవీలను చూడవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.649 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.649 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో కంపెనీ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు భారత్ అంతటా ఫ్రీ నేషనల్ రోమింగ్ నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. 100 ఫ్రీ రోజువారీ SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.