Realme 15 Pro 5G : 50MP మెయిన్ రియర్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌తో రియల్‌మి 15 ప్రో 5G.. లాంచ్ ఎప్పుడంటే?
Realme 15 Pro 5G : రియల్‌మి 15 ప్రో 5G ఫోన్ రాబోతుంది. 50MP సోనీ IMX896 మెయిన్ రియర్ కెమెరా ఫీచర్లతో రానుంది. పూర్తి వివరాలివే..

Realme 15 Pro 5G
Realme 15 Pro 5G : రియల్‌మి నుంచి సరికొత్త 5G ఫోన్ వస్తోంది. ఈ నెల 24న భారత మార్కెట్లో బేస్ వేరియంట్ రియల్‌మి 15 5Gతో పాటు ఆవిష్కరించనుంది. రాబోయే ఈ హ్యాండ్‌సెట్ అనేక కీలక ఫీచర్లు ఇప్పటికే రివీల్ అయ్యాయి. కంపెనీ ప్రో వేరియంట్ కెమెరా వివరాలను కూడా వెల్లడించింది.
ఈ ఫోన్ మెయిన్ రియర్ కెమెరా సెన్సార్, వీడియో రికార్డింగ్ కెపాసిటీని వెల్లడించింది. రియల్‌మి 15 5G సిరీస్ ఫోన్‌లు రెండూ ఏఐ ఎడిట్ జెనీ, ఏఐ పార్టీ వంటి ఏఐ-ఆధారిత ఎడిటింగ్ ఫీచర్‌లతో రానుంది. రియల్‌మి 15 ప్రో 5G ఫోన్ ధర, స్పెషిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి..
రియల్‌మి 15ప్రో 5G కెమెరా ఫీచర్లు :
రియల్‌మి 15ప్రో 5G ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో 50MP సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ఫ్రంట్, రియర్ కెమెరాలలో 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
రియల్‌మి 14 ప్రో 5Gతో పోలిస్తే.. రియల్‌మి 15 ప్రో 5G 4x క్లియర్ జూమ్ 2x కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. రాబోయే హ్యాండ్‌సెట్‌లోని కెమెరా ఏఐ మ్యాజిక్‌గ్లో 2.0 ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ రియల్‌మి సిరీస్ ఏఐ పార్టీ మోడ్, రియల్ టైమ్‌లో షట్టర్ స్పీడ్, కాంట్రాస్ట్, ఆటో అడ్జెస్ట్ సీన్ డిటెక్షన్‌ను అందిస్తుంది. అదే సమయంలో, వాయిస్ కంట్రోల్ ఏఐ ఎడిట్ జెనీ 20 కన్నా ఎక్కువ భాషలకు సపోర్టు ఇస్తుంది.
రియల్‌మి 15 ప్రో 5G ఫోన్ :
ఈ రియల్‌మి ఫోన్ 4D కర్వ్+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్, 94 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 2,500Hz టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటి నిరోధకతకు IP69 రేటింగ్ కలిగి ఉంటుంది. రియల్‌మి 15 ప్రో 5G హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoCతో వస్తుందని ధృవీకరించింది.
120fps గేమ్‌ప్లే, GT బూస్ట్ 3.0, గేమింగ్ కోచ్ 2.0 టెక్నాలజీలకు సపోర్టు ఇస్తుంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 7.69mm మందంతో ఉంటుంది. రియల్‌మి 15 5G ప్రో వేరియంట్, వెనిల్లాతో పాటు, జూలై 24న సాయంత్రం 7 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లు ఫ్లోయింగ్ సిల్వర్, సిల్క్ పింక్, సిల్క్ పర్పుల్, వెల్వెట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా ఈ-స్టోర్ ద్వారా పొందవచ్చు.