Jio Cheapest Plan : పండగ చేస్కోండి.. జియో చీపెస్ట్ ప్లాన్‌తో రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా..!
Jio Cheapest Plan : జియో అదిరిపోయే ప్లాన్.. రోజుకు 2GB హైస్పీడ్ డేటా, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.

Jio Prepaid Plans
Jio Cheapest Plan : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో తమ కస్టమర్ల కోసం తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ప్లాన్‌లను అందిస్తోంది. చాలా జియో ప్లాన్‌లు (Jio Cheapest Plan) అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. జియో 28 రోజుల నుంచి 365 రోజుల వరకు వ్యాలిడిటీ ప్లాన్‌లను అందిస్తోంది.
మీరు జియో కస్టమర్ అయితే తక్కువ ధరలో అద్భుతమైన బెనిఫిట్స్ అందించే ప్లాన్లను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం చౌకైన రీఛార్జ్ ప్లాన్ ఒకటి ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. జియో ఈ ప్లాన్ వివరాలను ఓసారి చూద్దాం..
జియో 84 రోజుల వ్యాలిడిటీ :
జియో బేసిక్ ప్లాన్ ధర రూ.1,029. జియో ప్లాన్‌లో యూజర్లు 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దేశమంతటా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ బెనిఫిట్స్ పొందుతారు. ఇంటర్నెట్ డేటా విషయానికి వస్తే.. రోజువారీ 2GB హైస్పీడ్ డేటా అందిస్తోంది.
జియో యూజర్లు మొత్తం 168GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఆసక్తిగల యూజర్లు ఈ రీఛార్జ్ ప్లాన్‌తో OTT యాప్‌కు ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.
వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు. జియో యూజర్లు జియో టీవీ, జియో క్లౌడ్ యాప్‌ను ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, మీ వద్ద 5G స్మార్ట్‌ఫోన్ ఉండాలి. జియో 5G నెట్‌వర్క్ వాడుతుంటే.. ప్లాన్‌తో ఫ్రీగా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌ను జియో వెబ్‌సైట్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు.