Post Office Scheme : ఈ పోస్టాఫీసు పథకంలో ఒకసారి రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. రూ. 7లక్షలకు పైగా సంపాదించుకోవచ్చు..!

Post Office Scheme : ఈ పోస్టాఫీసు పథకంలో ఒకసారి రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. రూ. 7లక్షలకు పైగా సంపాదించుకోవచ్చు..!

Post Office Scheme

Updated On : July 15, 2025 / 2:18 PM IST

Post Office Scheme : పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడి వస్తుందా? అని ఆలోచిస్తున్నారా? అయితే, మీకోసం పోస్టాఫీసులో (Post Office Scheme) అద్భుతమైన పథకం ఉంది.. అదే.. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్.. ప్రభుత్వం అందించే ఈ సేవింగ్స్ స్కీమ్‌లో భారీగా రాబడిని పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో భవిష్యత్తు గురించి ఆలోచించి పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.

ఎందుకంటే.. వైద్య అత్యవసరాలు కావొచ్చు.. పిల్లల విద్యకైనా, లేదా రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భద్రత చాలా అవసరం. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో డబ్బుకు కొరత లేకుండా జీవించవచ్చు.

చిన్న, మధ్యతరగతివారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేయాల్సిందిల్లా.. ప్రతి నెలా రూ. 10వేలు RD పథకంలో డిపాజిట్ చేస్తే చాలు.. కేవలం 5 ఏళ్లలోనే దాదాపు రూ. 7,13,659 లక్షల వడ్డీ పొందవచ్చు. ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Vivo X Fold 5 : వివో క్రేజే వేరబ్బా.. కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలుసా?

రికరింగ్ డిపాజిట్ (RD) ఏంటి? :
రికరింగ్ డిపాజిట్ (RD) చిన్న పొదుపు పథకం. ఈ పథకంలో ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని బ్యాంకు లేదా పోస్టాఫీసులో డిపాజిట్ చేయాలి. ఈ డబ్బుపై వడ్డీని పొందవచ్చు. పెద్ద మొత్తంలో సంపాదించుకోవచ్చు. పోస్టాఫీస్ RD ప్లాన్ ఎంచుకుంటే.. డబ్బు చాలా సురక్షితంగా ఉంటుంది. స్థిరమైన రాబడిని అందిస్తుంది. ఈ పథకాలకు షేర్ మార్కెట్‌తో సంబంధం ఉండదు.

చిన్నమొత్తంలో సేవింగ్స్ :
తక్కువ మొత్తంతో డబ్బు సేవింగ్ (Post Office Scheme) చేసుకోవచ్చు. ఈ RD ప్లాన్ మంచిది. మీరు కేవలం రూ. 100తో ప్రారంభించవచ్చు. ఉదాహరణకు.. మీరు 5 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 10వేలు పెడితే మీకు మొత్తం రూ. 7,13,659 వస్తుంది. ఇందులో మీరు డిపాజిట్ చేసిన డబ్బు రూ. 6లక్షలు ఉంటే.. రూ. 1,13,659 వడ్డీనే వస్తుంది.

RD వడ్డీ రేటు ఎంతంటే? :
జూలై నుంచి సెప్టెంబర్ 2025 వరకు పోస్ట్ ఆఫీస్ RDపై వడ్డీ రేటు సంవత్సరానికి 6.7శాతంగా అందిస్తోంది. ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ రేటును చెక్ చేసి మారుస్తుంటుంది.

రికరింగ్ డిపాజిట్ నుంచి లోన్ సౌకర్యం :
రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి ప్రారంభించిన ఏడాది తర్వాత నుంచి మీ డిపాజిట్‌లో 50శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఈ డబ్బు వినియోగించుకోవచ్చు. కానీ, ఈ రుణంపై వడ్డీ RD రేటు కన్నా 2శాతం ఎక్కువగా ఉంటుంది.