Vivo X Fold 5 : వివో క్రేజే వేరబ్బా.. కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలుసా?
Vivo X Fold 5 : వివో నుంచి మడతబెట్టే ఫోన్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో వివో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.. ధర, ఇతర వివరాలపై ఓ లుక్కేయండి.

Vivo X Fold 5
Vivo X Fold 5 : వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. వివో X200 FEతో పాటు లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ కూడా ఆవిష్కరించింది. భారత మార్కెట్లో కంపెనీ ఫస్ట్ బుక్-స్టైల్ ఫోల్డబుల్ (Vivo X Fold 5) స్మార్ట్‌ఫోన్‌గా వివో X ఫోల్డ్ 5 లాంచ్ అయింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ అమర్చింది.
వివో ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. కేవలం 4.3mm మందం ఉంటుంది. ఇటీవలే లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7తో పోటీగా వచ్చింది. వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
వివో X ఫోల్డ్ 5 భారత్ ధర ఎంతంటే?:
16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ వివో X ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999కు లభిస్తోంది. ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఈరోజు నుంచి ప్రారంభమై జూలై 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్లు అంతటా మెజోట్ రిటైలర్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు HDFC, SBI, Axis బ్యాంక్ కార్డులతో రూ. 15వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. కొనుగోలుదారులకు ఒక ఏడాది ఎక్స్‌టెండెడ్ వారంటీ, రూ. 1,499కి వివో TWS 3e కూడా లభిస్తాయి.
వివో X ఫోల్డ్ 5 స్పెసిఫికేషన్లు :
వివో X ఫోల్డ్ 5 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో 16GB ర్యామ్, 512GB స్టోరేజీతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్OS 15పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 8.03-అంగుళాల అమోల్డ్ మెయిన్ డిస్‌ప్లే, 6.53-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండూ 120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంటాయి.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఇందులో 50MP IMX921 OIS VCS, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP IMX882 OIS టెలిఫోటో లెన్స్, అద్భుతమైన 100x హైపర్‌జూమ్ ఉన్నాయి. అదనంగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం కవర్, మెయిన్ స్క్రీన్‌లలో 20MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా చూస్తే.. వివో X ఫోల్డ్ 5 బ్లూటూత్ 5.4, WiFi 5తో అమర్చి ఉంది.
ఈ ఫోన్ రెండు నానో సిమ్ కార్డులకు సపోర్టు ఇస్తుంది. డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం IPX8, IPX9, IPX9+, IP5X రేటింగ్ పొందింది. 80W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. ఈ వివో ఫోన్ 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు స్మార్ట్‌ఫోన్ 9.2mm సైజు ఉంటుంది. ఫోల్డ్ ఓపెన్ చేస్తే కేవలం 4.3mm సన్నగా మాత్రమే ఉంటుంది. ఈ వివో X ఫోల్డ్ మొత్తం బరువు 217 గ్రాములు ఉంటుంది.