Airtel Plans Price : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్.. 84 రోజుల రీఛార్జ్ ప్లాన్ పెంపు.. కొత్త ధర ఎంతో తెలుసా?
Airtel Plans Price : భారతీయ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నాయి. ఎయిర్‌టెల్ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ భారీగా పెంచేసింది. ఈ కంపెనీ చౌకైన కొన్ని ప్లాన్‌లను నిలిపివేసింది.
- Sreehari A
- Updated on- April 21, 2026 / 05:57 PM IST
Airtel Plans Price
- ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
- 84 రోజుల ప్లాన్ ధర పెంచిన ఎయిర్‌టెల్
- రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచుతున్న టెల్కోలు
Airtel Plans Price : ఎయిర్ టెల్ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. దేశీయ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఒక్కొక్కటిగా పెంచుతున్నాయి. ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది.
ముఖ్యంగా ఎయిర్‌టెల్ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో భారీగా మార్పులు చేసింది. ఈ కంపెనీ (Airtel Plans Price) కొన్ని చౌకైన ప్లాన్‌లను నిలిపివేసింది. ప్రస్తుతం ధరలను భారీగా పెంచింది. నివేదికల ప్రకారం.. ఎయిర్‌టెల్ రూ. 799 ప్లాన్‌ను నిలిపివేసింది. అంతేకాకుండా, రూ. 859 ప్లాన్ ధరను రూ. 899కి పెంచింది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
రూ. 899 కన్నా తక్కువ ధరకే కొత్త ప్లాన్ :
కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకునే కస్టమర్‌లు లోకల్, STD, నేషనల్ రోమింగ్ నెట్‌వర్క్‌లలో అన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు, రోజుకు 100 SMS పొందవచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 1.5GB డేటాను కూడా అందిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి లిమిట్ అవుతుంది.
రీఛార్జ్‌తో అదనపు బెనిఫిట్స్ ఇవే :
ఈ ప్లాన్‌లో 12 నెలల పాటు అడోబ్ ఎక్సెస్ ప్రీమియం యాక్సెస్, కాల్స్ మెసేజ్‌ల కోసం స్పామ్ ప్రొటెక్షన్ అలర్ట్‌లు, ప్రతి 30 రోజులకు ఒకసారి ఫ్రీ హలోట్యూన్స్ లభిస్తాయి. అయితే, గతంలో రూ. 859 వెర్షన్‌లో అందుబాటులో ఉన్న రివార్డ్స్‌మినీ క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ ఈ ప్లాన్‌లో కనిపించడం లేదు. ఈ మార్పుపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
క్రమంగా టారిఫ్ ధరల పెంపు :
ఎయిర్‌టెల్ అందించే టారిఫ్ ధరల పెంపు పెద్దగా లేదనే చెప్పాలి. అది కూడా కేవలం ఒక ప్లాన్‌కు మాత్రమే పరిమితం. కంపెనీ ప్రస్తుతం పెద్దఎత్తున టారిఫ్‌లను పెంచే ఆలోచనలో లేన్నట్టుగా కనిపిస్తోంది. క్రమంగా ఒక్కో ప్లానులో టారిఫ్ మార్పులు తీసుకురాన్నట్టు తెలుస్తోంది.
వినియోగదారులను 5జీ సర్వీసులకు రీడైరెక్ట్ అయ్యేలా చేసి కంపెనీ సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవాలని చూస్తోంది. దాంతో ఎయిర్‌టెల్ 1.5GB ప్లాన్‌లపై డిస్కౌంట్లను తగ్గిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పును పరిశీలిస్తే.. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లలో పెద్దగా ధరల పెరుగుదల ఉండకపోవచ్చు.
టెలికాం కంపెనీలు సాధారణంగా భారీ టారిఫ్ మార్పులను ఒకేసారి ప్రకటిస్తాయి. ఎయిర్‌టెల్ ప్లాన్ల ధరలను పెంచడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు.. ఈ ఏడాది ప్రారంభంలో టెల్కో సంస్థ గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను రూ. 4వేల నుంచి రూ. 4,999కి పెంచింది.
జియో 90 రోజుల వ్యాలిడిటీ :
జియో రూ. 899 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఎయిర్‌టెల్ 84 రోజుల కన్నా కొంచెం ఎక్కువ. రోజుకు 2GB డేటాతో పాటు అదనంగా 20GB, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది.
అదనపు బెనిఫిట్స్ విషయానికొస్తే.. జియో 3 నెలల పాటు జియోటీవీ, జియోహాట్‌స్టార్‌లకు యాక్సెస్, 50GB స్టోరేజ్‌తో జియోఏఐక్లౌడ్‌ను అందిస్తుంది. అర్హులైన యూజర్ల కోసం విస్తరించిన గూగుల్ జెమిని ప్రో బెనిఫిట్స్ అందించే ప్రమోషనల్ ఆఫర్ కూడా ఉంది. ఈ ప్లాన్‌తో పోలిస్తే.. ఎయిర్‌టెల్ రూ. 899 ప్లాన్ డిజిటల్ బెనిఫిట్స్ లేకుండా డేటా, కాల్స్ SMS మాత్రమే అందిస్తుంది.
