×
Ad

Airtel Recharge Plan : పండగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో ఏడాదంతా ఎంజాయ్..!

Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ సరసమైన 365 రోజుల ప్లాన్‌తో ఒక ఏడాది పాటు ఫుల్ యాక్టివ్‌గా ఉండొచ్చు. అనేక ఆకర్షణీయమైన బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Airtel Recharge Plan

Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రస్తుతం భారతీయ మొబైల్ యూజర్లలో 380 మిలియన్లకు పైగా ఎయిర్‌టెల్ సర్వీసులను అందిస్తోంది. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 365 రోజుల వ్యాలిడిటీతో అనేక సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో (Airtel Recharge Plan) ట్రాయ్ ఆదేశాలను అనుసరించి కంపెనీ యూజర్ల కోసం రెండు వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

ఈ ప్లాన్‌లలో ఒకటి 84 రోజుల వ్యాలిడిటీ, మరొకటి 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ రెండు ఆప్షన్లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ SMS బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ లాంగ్ టైమ్ ఎయిర్‌టెల్ ప్లాన్‌లు ఎయిర్‌టెల్ నంబర్‌ను సెకండరీ సిమ్‌గా ఉపయోగించే యూజర్లకు బెటర్. 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లు ఏడాది పొడవునా నంబర్‌ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఎయిర్‌టెల్ రూ. 1849 రీఛార్జ్ ప్లాన్ :
రూ. 1849 ధర కలిగిన ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది.
వ్యాలిడిటీ : 365 రోజులు
కాలింగ్ : భారత్‌లో ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ (ఫ్రీ నేషనల్ రోమింగ్‌తో సహా)
SMS : మొత్తం 3,600 ఫ్రీ SMS బెనిఫిట్స్
అదనపు బెనిఫిట్స్ : ఫ్రీ హలో ట్యూన్స్
ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్, SMS బెనిఫిట్స్ కోసం అందుబాటులో ఉంది. ఇందులో ఎలాంటి డేటా రాదు. డేటా అవసరమయ్యే యూజర్లు ఎయిర్‌టెల్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లలో ఒకదానితో మీ ఫోన్ నంబర్‌ రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also : Home Insurance Guide : హోం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఫస్ట్ ఈ 5 విషయాలు తప్పక చదవండి.. లేదంటే భారీగా నష్టపోతారు..!

ఎయిర్‌టెల్ రూ. 2249 రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ డేటా బెనిఫిట్స్ సహా 365 రోజుల వ్యాలిడిటీతో మరో సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ కూడా అందిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా అలవెన్స్ రెండూ ఉంటాయి.

వ్యాలిడిటీ : 365 రోజులు
కాలింగ్ : భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్ (ఫ్రీ నేషనల్ రోమింగ్‌ సహా)
డేటా : 30GB హై-స్పీడ్ డేటా
SMS : 3,600 ఫ్రీ SMS బెనిఫిట్స్

అదనపు బెనిఫిట్స్ : ఫ్రీ హలో ట్యూన్స్
ధర : రూ. 249
ట్రాయ్ ఇటీవలే అక్టోబర్ 2025 సబ్‌స్క్రైబర్ రిపోర్టు రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. భారతీయ టెలికం మార్కెట్లో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 123.1 కోట్లకు చేరుకుంది. ఇందులో 118.4 కోట్ల మంది మొబైల్ యూజర్లు కాగా, 4.6 కోట్ల మంది వైర్‌లైన్ సర్వీసులకు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. పాన్-ఇండియా కనెక్టివిటీతో మొబైల్ యూజర్లు గత నెలతో పోలిస్తే స్వల్పంగా 0.19 శాతం పెరిగారు.