×
Ad

Amazon Black Friday Sale : అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఈరోజే లాస్ట్ ఛాన్స్.. డోంట్ మిస్!

Amazon Black Friday Sale : అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై ఖతర్నాక్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.

Amazon Black Friday Sale

Amazon Black Friday Sale : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్ బ్లాక్ ప్రైడే సేల్ డిసెంబర్ 1తో ముగుస్తోంది. ప్రస్తుతం అనేక ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్స్ సమయంలో వివిధ రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

అమెజాన్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ కూడా ఈ రాత్రికి ముగుస్తుంది. ఇందులో వన్‌ప్లస్ ప్రొడక్టులపై భారీ డీల్స్ అందిస్తోంది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో బాగా పాపులర్ పొందిన వన్‌ప్లస్ నార్డ్ మోడల్స్ రెండూ ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 13, వివిధ వన్‌ప్లస్ నార్డ్ రేంజ్ మోడళ్ల వంటి ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి.

వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై డిస్కౌంట్లు :
వన్‌ప్లస్ 15 ధర తగ్గింపు :
ప్రీమియం అప్‌గ్రేడ్ కోసం చూస్తున్నారా? ఇప్పుడు లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 15 అసలు ధర రూ. 72,999 నుంచి ధర రూ. 69,499కు తగ్గింది. ఈ హ్యాండ్‌సెట్ పవర్‌ఫుల్ 7,300mAh బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల BOE అమోల్డ్ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

Read Also : Airtel Recharge Plan : పండగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో ఏడాదంతా ఎంజాయ్..!

వన్‌ప్లస్ 13s ధర ఎంతంటే? :
ప్రీమియం కాంపాక్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ప్రస్తుతం వన్‌ప్లస్ 13s రూ.49,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13s రూ.54,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఈ కాంపాక్ట్ ప్రీమియం ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. 6.32-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. డాల్బీ విజన్ HDR10+ వంటి అనేక పవర్‌ఫుల్ ఫీచర్లను కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ రేంజ్‌పై డిస్కౌంట్లు :
అదనంగా, ప్రముఖ వన్‌ప్లస్ నార్డ్ లైనప్‌లోని అనేక మోడళ్లు భారీ తగ్గింపులతో లభ్యమవుతున్నాయి. మిడ్ రేంజ్ బడ్జెట్ ఆప్షన్లతో మరింత అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ ఇప్పుడు రూ.30,249కి లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ CE4 ధర రూ. 18,999కు, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5G ఫోన్ ధర రూ.15,999కి లభిస్తుంది.