Amazon Diwali Sale
Amazon Diwali Sale : శాంసంగ్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. ఈ పండగ సీజన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ తగ్గింపు ధరకే లభ్యమవుతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ సందర్భంగా ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు అందిస్తోంది. సాధారణంగా ఖరీదైన ప్రీమియం ఫోన్లు ఇప్పుడు సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి.
ఈ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (Amazon Diwali Sale) ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ధర రూ. 1,29,999కి లాంచ్ అయిన గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ధర రూ. లక్ష కన్నా తక్కువకు పడిపోయింది. ఈ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్‌లలో ఇదొకటిగా చెప్పొచ్చు.
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా లాంచ్ ధర రూ. 1,29,999 నుంచి రూ. 28,899 భారీ తగ్గింపుతో రూ. 1,01,100 వద్ద లిస్ట్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుంది. రూ. 3,033 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. తద్వారా ఈ అల్ట్రా ఫోన్ ధర రూ. 97,932కి తగ్గుతుంది.
కస్టమర్‌లు నెలకు రూ. 4,799తో ఈజీ ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. అయితే, మీ ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా రూ. 44,050 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. దాంతో మీరు శాంసంగ్ ఫ్లాగ్‌షిప్‌ను ఇంకా తక్కువ ధరకే పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌కు పవర్ అందించే క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 12GB వరకు ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. కెమెరా సెటప్ పరంగా 200MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో, 3x జూమ్‌తో 10MP టెలిఫోటో ఉన్నాయి.
సెల్ఫీల విషయానికి వస్తే.. 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. శాంసంగ్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. రోజంతా ఛార్జింగ్ వస్తుంది. వాస్తవానికి, ఇంటర్నల్ S పెన్ కీలకమైన ఫీచర్ అని చెప్పొచ్చు. నోట్-టేకింగ్, డ్రాయింగ్, కచ్చితమైన నావిగేషన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.