Amazon Great Summer Sale : టాప్ కెమెరా ఫోన్ ఇప్పుడు తక్కువ ధరకే.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాపై అదిరే ఆఫర్..
Amazon Great Summer Sale 2026 : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 సందర్భంగా మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
Motorola Edge 50 Ultra price cut ( Image Credit : Gemini AI )
- అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాపై భారీ తగ్గింపు
- ఈ ఫోన్ ప్రీమియం డిస్ప్లే, పర్ఫార్మెన్స్, టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా
- అమెజాన్‌లో బ్యాంక్ డిస్కౌంట్లు, ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు
Amazon Great Summer Sale 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీరు రూ. 40వేల బడ్జెట్లో ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026’లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో (Amazon Great Summer Sale) ఏకంగా రూ. 22వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
అద్భుతమైన డిజైన్, టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ (Amazon Great Summer Sale) కెమెరా సెటప్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ప్రస్తుత బ్యాంక్ కార్డు ఆఫర్లు కూడా మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. అమెజాన్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G ధర :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా రూ. 59,999 ధరతో లాంచ్ అయింది. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు రూ. 22,009 ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ. 37,990కే లభిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ మోటోరోలా ఫోన్ కొంటే అసలు ధర రూ. 1,250 వరకు తగ్గించుకోవచ్చు. ఈ-కామర్స్ బ్రాండ్ నెలకు కేవలం రూ. 1,336 నుంచి ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.
మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. తద్వారా రూ. 36వేలకే మోటోరోలా ఫోన్ వస్తుంది. అయితే, కచ్చితమైన వాల్యూ అనేది మోటోరోలా ఫోన్ పర్ఫార్మెన్స్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఎక్స్టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లను విడిగా కొనేసుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ ఫోన్ కొనాలా? వద్దా? :
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల pOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో గరిష్టంగా 2,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది.
ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పాటు 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. పవర్ పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్లో 4,500mAh బ్యాటరీ ఉంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ల వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 64MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అంతేకాదు.. ఈ మోటోరోలా ఫోన్ 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
రూ. 40వేల కన్నా తక్కువ ధరలో హై-ఎండ్ ఫోన్ కొనేవారికి మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G బెస్ట్ ఆఫ్షన్. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026లో ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు.
