Apple iPhone 16 : అమెజాన్‌లో అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ 16.. బ్యాంకు ఆఫర్లతో రూ. 4వేలు ఆదా!

Apple iPhone 16 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 128GB వేరియంట్ రూ.76,999 ధరకు లభిస్తోంది. ఎస్బీఐ కార్డ్‌లు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లతో అదనపు డిస్కౌంట్లు పొందొచ్చు.

Apple iPhone 16

  • అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 16 128GB రూ. 76,999 ధరకు లిస్టింగ్
  • మీరు ఎస్బీఐ కార్డుతో రూ. 3,250 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు
  • అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డుతో రూ. 3,812 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు

Apple iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 16 కొనేవారు ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఈ ఐఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ ధరపై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు లభ్యమవుతున్నాయి. ధరను ఐఫోన్ 16లో A18 చిప్‌సెట్, 48MP కెమెరా OLED డిస్‌ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇటీవలే ఐఫోన్ 17 లైనప్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మీరు కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. లేటెస్ట్ మోడల్ మీ బడ్జెట్‌లో దొరకపోతే.. ఈ అమెజాన్ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. అయితే, ఈ సేల్ ప్రారంభంలో డీల్ ధర తక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు మరింత పెరిగింది. ఐఫోన్ 16 ధర ఆఫర్ల పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

అమెజాన్‌లో ఐఫోన్ 16 డీల్ :
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 సందర్భంగా ఐఫోన్ 16 ఇప్పుడు రూ. 76,999కే లభిస్తుంది. అసలు ధరపై సుమారు రూ.13వేలు తగ్గింపు అందిస్తోంది. రూ.750 కూపన్ తగ్గింపు కూడా పొందొచ్చు. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో డబ్బులు కట్టే కస్టమర్‌లు అదనంగా రూ.3,250 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా మొత్తం డిస్కౌంట్ రూ.4వేలు అవుతుంది.

Read Also : New Electric Car Offers : పండక్కీ కొత్త కారు కొనాలా? రూ.4.69 లక్షల నుంచే ఎలక్ట్రిక్ కారు.. బెస్ట్ 4 EV కార్లు ఇవే!

అదే సమయంలో, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే రూ.3,812 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కూపన్ డిస్కౌంట్‌తో మొత్తం రూ.4,562 ఆదా చేయొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :

ఐఫోన్ 16లో 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్ 2,000 నిట్స్ వరకు టాప్ రేంజ్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్‌కు IP68 రేటింగ్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC, సింగిల్ USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 బ్యాక్ సైడ్ ఎఫ్/1.6 అపర్చర్‌తో 48MP వైడ్-యాంగిల్ కెమెరా ఉంది. దీనికి జతగా ఎఫ్/1.6 అపర్చర్‌తో 12MP 2x టెలిఫోటో కెమెరా ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో ఎఫ్/1.9 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా పరిశీలిస్తే.. ఐఫోన్ 16 పొడవు 147.6మిమీ, వెడల్పు 71.6మిమీ, మందం 7.8మిమీగా ఉంది. ఈ ఫోన్ బరువు 170 గ్రాములు ఉంటుంది.