Amazon Prime Day 2026 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆఫర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?

Amazon Prime Day 2026 : అమెజాన్ ప్రైమ్ డే 2026 సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, వన్‌ప్లస్ 13 మరిన్నింటిపై అడ్వాన్స్ డీల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Amazon Prime Day 2026

  • అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ ధర తగ్గింపు
  • ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • ఈ ప్రైమ్ డే సేల్ జూలై 6 వరకు కొనసాగుతుంది

Amazon Prime Day 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ డే 2026 ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. జూలై 4 నుంచి జూలై 6 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ వార్షిక సేల్ ఈవెంట్ స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్స్, ఆడియో డివైజ్‌లు, హోం అప్లియన్సెస్ మరిన్నింటిపై 72 గంటల పాటు డిస్కౌంట్లను అందిస్తుంది.

కొనుగోలుదారులు సాధారణ మార్కెట్ ధరల కన్నా చాలా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. డైరెక్ట్ ప్రైస్ కట్స్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను పొందవచ్చు. ఈ సేల్‌కు ముందు, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, ఐక్యూ 15, వన్‌ప్లస్ 13, రెడ్‌మి A7 ప్రో 5జీ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ ఎర్లీ డీల్స్‌ను అందిస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర రూ. 1,29,999 నుంచి తగ్గి ఇప్పుడు రూ. 89,999 ధరకే లభిస్తోంది. ఇతర ఫోన్ల డీల్స్‌లో వన్‌ప్లస్ 13 రూ. 54,999కి, వన్‌ప్లస్ N6 రూ. 21,999కి, వన్‌ప్లస్ నార్డ్ CE6 రూ. 29,999కి, ఐక్యూ నియో 10 రూ. 41,999కి లభ్యమవుతున్నాయి.

Read Also : Flipkart GOAT Sale 2026 : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 17 చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అడ్వాన్స్ డీల్స్ :
అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకంగా అర్హత గల ప్రొడక్టులపై ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ పొందవచ్చు. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

అలాగే, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు కూడా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. నేరుగా ధర తగ్గింపుతో పాటు రూ. 66వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే 2026కు ముందు కొన్ని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి..

అమెజాన్ ప్రైమ్ డే ఎర్లీ డీల్స్.. స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

ప్రొడక్టు ప్రారంభ ధర తగ్గింపు ధర సేవింగ్
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G రూ. 1,29,999 రూ. 89,999 రూ. 40,000
వన్‌ప్లస్ ఎన్6 రూ. 30,999 రూ. 21,999 రూ. 9,000
ఐక్యూ 15 రూ. 76,999 రూ. 76,999
షావోమీ రెడ్‌మి టర్బో 5 రూ. 54,999 రూ. 37,999 రూ. 17,000
రియల్మీ నార్జో 100 లైట్ 5G రూ. 15,499 రూ. 14,999 రూ. 500
వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ రూ. 31,999 రూ. 22,999 రూ. 9,000
ఐక్యూ నియో 10 రూ. 45,999 రూ. 41,999 రూ. 4,000
రెడ్‌మి A7 ప్రో 5G రూ. 15,999 రూ. 12,999 రూ. 3,000
శాంసంగ్ గెలాక్సీ M17 5జీ రూ. 16,499 రూ. 13,999 రూ. 2,500
వన్‌ప్లస్ నార్డ్ CE6 రూ. 40,999 రూ. 29,999 రూ. 11,000
ఐక్యూ జెడ్11x రూ. 28,999 రూ. 22,999 రూ. 6,000
శాంసంగ్ గెలాక్సీ M17e 5G రూ. 16,999 రూ. 12,499 రూ. 4,500
వన్‌ప్లస్ నార్డ్ 6 రూ. 52,999 రూ. 42,999 రూ. 10,000
ఐక్యూ 15R రూ. 53,999 రూ. 49,999 రూ. 4,000
శాంసంగ్ గెలాక్సీ M06 5జీ రూ. 14,999 రూ. 10,999 రూ. 4,000
వన్‌ప్లస్ 13 రూ. 72,999 రూ. 54,999 రూ. 18,000
శాంసంగ్ గెలాక్సీ M07 5జీ రూ. 10,999 రూ. 9,499 రూ. 1,500
రియల్ మి నార్జో 90x 5జీ (6GB + 128GB) రూ. 20,499 రూ. 19,499 రూ. 1,000
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో రూ. 3,999 రూ. 3,999
శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 ప్రో రూ. 29,999 రూ. 19,499 రూ. 10,500