Amazon Sale Offers : అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. రూ.34 వేల ఐక్యూ, రియల్‌మి ఫోన్లు రూ.18 వేలకే!

Amazon Freedom Sale : అమెజాన్ సేల్ సమయంలో ఐక్యూ, రియల్‌మి ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ లేటెస్ట్ ఫోన్లు భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.. అది ఎలాగంటే?

iQOO And Realme Smartphones

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై అదనపు సేవింగ్
  • ఐక్యూ జెడ్11 లైట్‌, రియల్‌మి నార్జో 100x 5జీ ఫోన్ల తగ్గింపు
  • అమెజాన్ సేల్‌లో మరెన్నో బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు

Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. అందులో ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది.

ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ అమర్చారు. అమెజాన్ సేల్‌లో అసలు ధర కన్నా చాలా తక్కువకే లభిస్తోంది. ఈ ఫోన్‌పై అదిరే డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐక్యూ జెడ్11 లైట్ అమెజాన్ ఆఫర్ :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఐక్యూ జెడ్11 లైట్‌ను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఫోన్ 43శాతం తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధర రూ.33,999 ఉండగా అమెజాన్ సేల్ సమయంలో రూ.17,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనే కస్టమర్‌లు నేరుగా రూ.1,250 ఆదా చేసుకోవచ్చు.

Read Also : Motorola Edge 70 Neo : మోటోరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 200MP కెమెరాతో ఎడ్జ్ 70 నియో వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్..!

రియల్‌మి నార్జో 100x 5జీ ఫోన్ :
అమెజాన్ సేల్‌లో మరో అద్భుతమైన డీల్ అందిస్తోంది. అదే.. రియల్‌మి నార్జో 100x 5జీ ఫోన్.. ఈ ఫోన్ అసలు ధర రూ. 31,999 ఉంటే రూ. 20వేల లోపే అందిస్తోంది. కానీ, సేల్ సమయంలో రూ. 19,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ 39శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 1,530 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

రియల్‌మి నార్జో 100x 5జీ ఫోన్ 8000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ సెగ్మెంట్‌లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. 144Hz రిఫ్రెష్ రేట్ అత్యత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫోన్ 1200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కంపెనీ 7 ఏళ్ల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని పేర్కొంది. ఈ ఫోన్‌లో హై రిజల్యూషన్ సపోర్ట్‌తో బ్రైట్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది.