×
Ad

iPhone 15 Sale : ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. అమెజాన్‌లో ఐఫోన్ 15పై రూ.29,651 తగ్గింపు.. ఎలాగంటే?

iPhone 15 Sale : ఐఫోన్ కొనడం మీ డ్రీమా? అయితే, అమెజాన్ సేల్ సందర్భంగా ఐఫోన్ 15పై అదిరిపోయే డిస్కౌంట్.. రూ. 79,900 నుంచి ఏకంగా రూ.29,651 తగ్గింపు పొందవచ్చు.

iPhone 15 Sale (Image Credit To Original Source)

  • జనవరి 16 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్
  • ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు
  • ఐఫోన్ 15 కొనుగోలుపై రూ. 29,651 తగ్గింపు

iPhone 15 Sale : ఆపిల్ కొత్త ఐఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. 2026లో రాబోయే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 భారీ తగ్గింపుతో లభించనుంది. మీరు ఈ ఐఫోన్ మోడల్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఫ్రీ ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేయొచ్చు. చాలా తక్కువ ధరకు బ్రాండ్-న్యూ ఐఫోన్ 15 సొంతం చేసుకోవచ్చు. గతంలో ఈ ఐఫోన్ 15 మోడల్ కేవలం రూ. 79,900 వద్ద లాంచ్ అయింది.

ఇప్పుడు అదే లాంచ్ ధరపై రూ. 29,651 తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు. అదేవిధంగా, ఈ నెల 16 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, మరిన్ని సేవింగ్స్ పొందవచ్చు. మీ పాత ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకున్నా ఐఫోన్ ధర తగ్గుతుంది. ఐఫోన్ 15 కొనుగోలుపై సేల్ ఆఫర్, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 15 సేల్ ధర, ఆఫర్లు :
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సేల్ సమయంలో ఐఫోన్ 15 (128GB) మోడల్ రూ. 50,249కి లభిస్తోంది. అంటే.. ఈ ఐఫోన్ కొనుగోలుపై దాదాపు రూ. 29,651 తగ్గింపు పొందవచ్చు. బ్యాంకు ఆఫర్లతో ఈ మోడల్ ధర ఇంకా తగ్గుతుంది.

బ్యాంక్ డిస్కౌంట్లు :
ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఇతర బ్యాంక్ కార్డ్‌లపై 10శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఐఫోన్ ధర మరింత తగ్గుతుంది.

Read Also : Motorola G57 Power 5G : 7000mAh బ్యాటరీతో మోటోరోలా 5G ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15వేల లోపే.. ఫుల్ డిటెయిల్స్!

అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ :
ఈ కార్డు ద్వారా 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తద్వారా మరింత ఆదా చేయొచ్చు.

iPhone 15 Sale (Image Credit To Original Source)

ఎక్స్ఛేంజ్ బోనస్ :
మీ పాత ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేస్తే ఐఫోన్ 15పై ఇంకా తగ్గింపు పొందవచ్చు.

ఐఫోన్ 15 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 15లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. తద్వారా ఈ ఐఫోన్ అద్భుతమైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఫ్రేమ్, స్మాల్ డిజైన్‌తో క్వాలిటీతో వస్తుంది. ఈ ఐఫోన్ USB-C పోర్ట్‌తో వస్తుంది. iOSతో రన్ అవుతుంది. అలాగే, బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఛార్జింగ్ అందిస్తుంది.

ఐఫోన్‌ 15లో ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్, పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉన్నాయి. సాధారణ వినియోగం, గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. 48MP ప్రైమరీ కెమెరాతో మంచి వీడియో ఫొటోగ్రఫీని అందిస్తుంది. ఫొటో క్వాలిటీ కోసం HDR సపోర్ట్ నైట్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.