Apple Mega Event : సెప్టెంబర్ 9న ఆపిల్ నుంచి భారీ సర్‌ప్రైజ్‌లు! ఐఫోన్18 ప్రో నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ వరకు
Apple Mega Event : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ప్రతి ఏడాదిలాగే 2026లో సెప్టెంబర్ 9న ఆపిల్ మెగా ఈవెంట్ నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఐఫోన్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ సహా, ఐఫోన్ 18 సిరీస్ మోడల్స్ లాంచ్ చేయనుంది. ఇంకా ఏం ఉండొచ్చంటే?
- Sreehari A
- Published on- September 8, 2026 / 03:56 PM IST
Apple event September 9
- ఆపిల్ లవర్స్‌కు గుడ్ ఐఫోన్ 18 ప్రో సహా 9 కొత్త లాంచ్‌లు
- సెప్టెంబర్ 9న ఈవెంట్లో 9 కొత్త ప్రొడక్ట్స్‌పై భారీ అంచనాలు
- ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది.. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ కూడా
Apple Mega Event : ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఆపిల్ ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది. ఆపిల్ సెప్టెంబర్ 9వ తేదీ ఈవెంట్ కోసం రెడీ అవుతోంది. ఈ ఆపిల్ ఈవెంట్‌లో అనేక కొత్త ప్రొడక్టులను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది.
ఈ ఈవెంట్‌లో కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఐఫోన్ అల్ట్రా పేరుతో కంపెనీ ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్‌లో కొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్, అప్‌డేట్ ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ మోడల్స్, అలాగే ఆపిల్ స్మార్ట్-హోమ్ ప్రొడక్టులకు సంబంధించిన అప్‌డేట్‌లను కూడా ఆవిష్కరించనుందని భావిస్తున్నారు.
సెప్టెంబర్ 9న భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10:30 గంటలకు ఆపిల్ ఈవెంట్ లైవ్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్లో ఆపిల్ అనేక ప్రొడక్టులను ప్రకటించనుంది. మరికొన్ని ఈ ఏడాది చివరిలో రావచ్చని బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ నివేదించారు. ఇంకా ఏయే అప్ డేట్స్ ఉండొచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ :
కొత్త ఐఫోన్ 18 లైనప్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మొదటగా మార్కెట్లోకి రానున్నాయి. ఆ తర్వాత 2027లో స్టాండర్డ్ ఐఫోన్ 18 మోడళ్లు రానున్నాయి. ఆపిల్ అందించే ప్రో మోడల్స్, ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే డిజైన్‌తో వస్తుందని భావిస్తున్నారు.
అయితే, డైనమిక్ ఐలాండ్ చిన్నదిగా ఉండొచ్చు. ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా 24MPకి అప్‌గ్రేడ్ కావచ్చు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో వేరియబుల్-అపెర్చర్ ప్రైమరీ కెమెరా లాంగ్ ఆప్టికల్ జూమ్ ఉండొచ్చు. ఈ 2 ఫోన్‌లు ఆపిల్ 2nm A20 ప్రో చిప్‌సెట్ కొత్త C2 మోడెమ్‌తో వర్క్ చేస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌కు భారీ బ్యాటరీ కూడా ఉండనుంది.
ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రాపై ఫోకస్ :
ఆపిల్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ రాబోతుంది. ఐఫోన్ అల్ట్రాలో 5.5-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఈ ఐఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే 7.8-అంగుళాల స్క్రీన్‌గా ఉంటుందని అంచనా.
Read Also : Samsung Galaxy A07s : బడ్జెట్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. జస్ట్ రూ. 16 వేలకే కొత్త శాంసంగ్ ఫోన్..!
బ్లూమ్‌బెర్గ్‌కు మార్క్ గుర్మాన్ ప్రకారం.. ఈ ఐఫోన్ అల్ట్రా బుక్ లాంటి డిజైన్‌తో అత్యంత సన్నగా ఉంటుంది. ప్రస్తుత ఫోల్డబుల్ ఫోన్లలో మాదిరిగా ఫోల్డ్ కనిపించకుండా ఉండేలా ఆపిల్ ఐఫోన్ అల్ట్రా తీసుకురానుందని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఫోల్డబుల్ ఐఫోన్ A20 ప్రో చిప్ C2 మోడెమ్‌తో రానుంది. ఇందులో రెండు రియర్ కెమెరాలు ఉండొచ్చు. ఫేస్ ఐడీకి బదులుగా పవర్ బటన్‌లోనే టచ్ ఐడీని అందించనుంది. ఈ ఐఫోన్ ధర 2వేల డాలర్ల కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా.
ఎయిర్‌పాడ్స్ 5 ఆపిల్ వాచ్ అప్‌డేట్స్ :
ప్రస్తుత ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4ను పోలిన డిజైన్‌తో ఎయిర్‌పాడ్స్ 5 ప్రవేశపెట్టనుంది. నివేదికల ప్రకారం.. ఇందులో కొత్త చిప్, టచ్ ఆధారిత వాల్యూమ్ కంట్రోలింగ్, హార్ట్ రేట్ సెన్సార్ వంటి అప్‌గ్రేడ్‌లు ఉంటాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 12, ఆపిల్ వాచ్ అల్ట్రా 4 కూడా ఆపిల్ రాబోయే లైనప్‌లో భాగంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ కొత్త మోడళ్లు అడ్వాన్స్ హెల్త్-ట్రాకింగ్ ఫీచర్లు, కొత్త బ్యాండ్ అటాచ్‌మెంట్ సిస్టమ్ S12 చిప్‌ను తీసుకురానుంది.
ఆపిల్ టీవీ కొత్త హోమ్‌పాడ్ లైనప్ :
గత నాలుగేళ్లుగా ఎలాంటి మెయిన్ హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్ అందించని ఆపిల్ ఇప్పుడు కొత్త ఆపిల్ టీవీ 4Kను డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డివైజ్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లు, అప్‌గ్రేడ్ వై-ఫై ఆప్షన్లు ఉండొచ్చు.
ఆపిల్ హోమ్‌ప్యాడ్ పేరుతో కొత్త స్మార్ట్-హోమ్ హబ్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ డివైజ్ ఐప్యాడ్ వంటి టచ్‌స్క్రీన్‌తో పాటు ఒక స్పీకర్ ఉంటుంది. కొత్త హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా రన్ అవుతుంది. ఆపిల్ పవర్ ఫుల్ చిప్ మెరుగైన ఆడియోతో సెకండ్ జనరేషన్ హోమ్‌పాడ్ మినీపై కూడా వర్క్ చేస్తుందని సమాచారం..
మరిన్ని ఆపిల్ ప్రొడక్టులు :
గుర్మాన్ ప్రకారం.. రాబోయే ఏళ్లలో ఆపిల్ డజన్ల కొద్దీ ప్రొడక్టులను డెవలప్ చేస్తోంది. ఇందులో ఓఎల్ఈడీ ఐప్యాడ్ మినీ, ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్‌తో ఆపిల్ ఫస్ట్ మ్యాక్ M6 చిప్‌లతో కొత్త మ్యాక్‌లను రిలీజ్ చేయనుంది. అయితే, సెప్టెంబర్ 9న జరిగే ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 18 ప్రో మోడల్స్ సహా ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ కూడా లాంచ్ కానుంది.
