Apple iPhone 11 discount now available on Flipkart, Check Full Details
Apple iPhone 11 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ (iPhone 11) మోడల్ 2019 నుంచి పాపులర్ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart)లో అద్భుతమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్‌పై ఎలాంటి ఆఫర్లను అందిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో సహా ఐఫోన్ ధర ఎంతవరకు తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఐఫోన్ 11 కెమెరా ఫీచర్లు అత్యంత ప్రకాశవంతమైన ఫొటోలను వీక్షించేందుకు 6.1-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆపిల్ A13 బయోనిక్ చిప్‌పై రన్ అవుతుంది.
Read Also : Apple iPhone 12 Offer : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ. 6 వేలు మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!
ఈ ఐఫోన్‌లో 12MP లెన్స్‌లతో 2 కెమెరాలు ఉన్నాయి. మీరు 4K క్వాలిటీలో అద్భుతమైన ఫొటోలు, రికార్డ్ వీడియోలను తీయవచ్చు. నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, స్మార్ట్ HDR వంటి స్పెషల్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. మీ ఫేస్ ఉపయోగించి అన్‌లాక్ చేయవచ్చు. అంతేకాదు.. వైర్‌లెస్‌గా కూడా ఛార్జ్ చేయవచ్చు. కూల్ డిజైన్, వేగవంతమైన పనితీరు, అద్భుతమైన కెమెరాతో, ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వ్యక్తులకు ఐఫోన్ 11 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 11పై డిస్కౌంట్ :
వాస్తవానికి, ఐఫోన్ 11 128GB వెర్షన్ ధర రూ. 48,900గా ఉంది. కానీ, ఇప్పుడు, ఈ ఐఫోన్ కేవలం రూ. 44,999కు మాత్రమే సొంతం చేసుకోవచ్చు. అంటే.. ఐఫోన్ 7 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ డీల్, బ్యాంక్ ఆఫర్ల ప్రయోజనాన్ని పొందడం ద్వారా ఐఫోన్ 11 మరింత చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 11 discount now available on Flipkart, Check Full Details
ఇతర ఐఫోన్ డీల్స్ :
ఫ్లిప్‌కార్ట్‌లో (iPhone 14) పెద్ద ఎక్స్ఛేంజ్ డీల్‌ను అందిస్తోంది. మీ పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 39,700 తగ్గింపు పొందవచ్చు. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ధర తగ్గింపు ఆధారపడి ఉంటుందని గమనించాలి. మీరు నివసిస్తున్న ప్రాంతంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీ పిన్ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
అదనంగా, మీరు EMI లావాదేవీలతో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు రూ. 1000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. 5 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు. మీ ఐఫోన్ 11 కొనేందుకు చూస్తుంటే ఇదే సరైన సమయం.. తద్వారా కొంత డబ్బు ఆదా చేయడంతో తక్కువ బడ్జెట్‌లో సరైన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Read Also : Apple iPhone 11 Deal : ఆపిల్ ఐఫోన్ 11పై అద్భుతమైన డీల్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరసమైన ధరకే సొంతం చేసుకోండి..!