Apple iPhone 14 Sale on Amazon : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో ఆపిల్ ఐఫోన్ 14 భారీ తగ్గింపుతో అందిస్తోంది. వాస్తవానికి ఈ ఐఫోన్ ధర రూ.79,900గా ఉండగా.. అమెజాన్ సేల్ ద్వారా ఈ ఐఫోన్ ధర ఒక్కసారిగా రూ.71,999కి తగ్గింది. మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయడం, బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి ధరను మరింత తగ్గించవచ్చు. భారత మార్కెట్లో ఐఫోన్ 14 మోడల్ 128GB వేరియంట్ ధర రూ. 79,999 ఉండగా.. A15 బయోనిక్ చిప్‌తో పాటు 512GB వరకు RAMతో వస్తుంది.
ఐఫోన్ 14 డీల్ ఇదే :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 మోడల్ 128GB వేరియంట్ ధర రూ.71,999కు విక్రయిస్తోంది. అయితే, ఈ ఫోన్ ధరను మరింత తగ్గించాలంటే.. మీ HDFC కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఈ డివైజ్‌పై రూ.4వేల వరకు తగ్గింపును పొందవచ్చు. దాంతో ఈ ఫోన్ ధర రూ.67,999కి తగ్గింది.
మీ దగ్గర పాత ఐఫోన్ ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ లో పాత ఫోన్‌కు రూ. 22,500 వరకు ఎక్స్ఛేంజ్ విలువను అందిస్తోంది. మీ పాత iPhone 13ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. మీ డివైజ్ ధర రూ. 22,500 వరకు పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ వాల్యూ.. మీ ఫోన్ కండిషన్, బ్యాటరీ హెల్త్, ఏ సంవత్సరంలో తయారైంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్, సన్నని బెజెల్స్‌తో, అనేక కలర్ ఆప్షన్లతో వచ్చింది. ఈ ఫోన్ డిస్ప్లే HDRకి సపోర్టు ఇస్తుంది. 1200-నిట్స్ బ్రైట్నెస్, ఫేస్ ID సెన్సార్లతో వస్తుంది. 60Hz ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14 మోడల్ A15 బయోనిక్ చిప్, 16-కోర్ NPU, 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రాసెసర్ గరిష్టంగా 4GB RAM, మూడు స్టోరేజీ (128GB, 256GB, 512GB) ఆప్షన్లతో వస్తుంది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ iOS 16 వెర్షన్‌తో రన్ అవుతుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, GPS, ఛార్జింగ్ లైట్నింగ్ పోర్ట్‌కు సపోర్టుతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఐఫోన్ 14 డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో పెద్ద f/1.5 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ OIS, సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో ప్రైమరీ 12MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజన్‌కు సపోర్టు అందిస్తుంది.