Apple iPhone 16 : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 భారీగా తగ్గిందోచ్.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో..!
Apple iPhone 16 : ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సరసమైన ధరకే లభిస్తోంది. అసలు ధర రూ. 79,900 ఉండగా విజయ్ సేల్స్ ద్వారా కేవలం రూ. 63వేలకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- June 26, 2026 / 02:41 PM IST
Apple iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఐఫోన్ ధరలు పెరగకముందే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ రూ. 79,900 ధరతో లాంచ్ కాగా ఇప్పుడు సేల్ సమయంలో రూ. 63వేలకే లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో A18 చిప్‌సెట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్ ఉంది. కెమెరా ప్రియుల కోసం డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 డీల్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 డీల్ :
ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16 ధర రూ. 13,410 తగ్గింది. తద్వారా ఈ ఐఫోన్ మోడల్ ధర రూ. 66,490కి తగ్గింది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే ధర రూ. 3,500 వరకు తగ్గుతుంది. దాంతో ఐఫోన్ ఫైనల్ ధర రూ. 62,990 అవుతుంది.
అంతేకాదు.. ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3,108 నెలవారీగా చెల్లించి ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే.. వర్కింగ్ కండిషన్, బ్రాండ్ పేరు, మోడల్ బట్టి భారీ తగ్గింపు పొందవచ్చు. కొత్త ఐఫోన్ కొనుగోలుపై ఆపిల్ కేర్ ప్లస్ కూడా పొందవచ్చు.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. అంతేకాదు.. ఈ ఐఫోన్ మోడల్‌లో ఆపిల్ A18 ప్రాసెసర్, 8GB ర్యామ్ ఉన్నాయి. ఐఫోన్ 16 ఈ లేటెస్ట్ వెర్షన్ సరికొత్త iOS26తో వస్తుంది.
3,561mAh బ్యాటరీతో మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 25W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యం ఉంది. ఈ ఫోన్‌లో 48MP ప్రైమరీ కెమెరా లెన్స్‌తో పాటు సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరా 12MP అత్యంత ఆకర్షణగా చెప్పొచ్చు.
ఐఫోన్ 16 కొనాలా? వద్దా? :
ఆపిల్ ఐఫోన్ 16 అద్భుతమైన మోడల్. ప్రస్తుతం రూ. 66,500 కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ధరలో మంచి కెమెరా, స్క్రీన్‌తో పాటు iOS సెక్యూరిటీ కూడా అందిస్తుంది. ఒకవేళ మీకు ఇతర ఫోన్లలో ఏదైనా కొనాలని అనిపిస్తే గూగుల్ పిక్సెల్ 10, ఒప్పో రెనో 15 ప్రో, ఆపిల్ ఐఫోన్ 17ఇ మోడల్స్ ట్రై చేయొచ్చు..
