Apple iPhone 16 Deal : ఇది కదా డిస్కౌంట్.. ఈ ఐఫోన్ 16పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇలా కొంటే రూ. 15వేలు తగ్గింపు..!

Apple iPhone 16 Deal : ఆపిల్ ఐఫోన్ 16పై అదిరిపోయే డిస్కౌంట్.. ఈ ఐఫోన్ మోడల్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఇలా కొన్నారంటే రూ. 15వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ వివరాలివే..

Apple iPhone 16 Deal

  • ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 భారీ తగ్గింపుతో లభిస్తోంది
  • బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ధర ఇంకా తగ్గుతుంది
  • పవర్‌ఫుల్ చిప్, OLED డిస్‌ప్లే సామర్థ్యంతో కెమెరాలు

Apple iPhone 16 Deal : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. రూ. 79,900కు లాంచ్ అయిన ఈ ఐఫోన్ ఇప్పుడు రూ. 65వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వినియోగదారులు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అసలు ధరను మరింత తగ్గించుకోవచ్చు. లిమిటెడ్ టైమ్ ఆఫర్ త్వరలో ముగియనుంది. మీరు ఈ ఐఫోన్ సొంతం చేసుకోవాలంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్ 16 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
ఆపిల్ ఐఫోన్ 16 తొలుత రూ. 79,900 ధరకు లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం ఈ ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15వేలు తగ్గింపుతో రూ. 64,900 ధరకు అమ్ముడవుతోంది. నేరుగా తగ్గింపుతో పాటు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 5,145 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ. 59,755కు తగ్గుతుంది.

Read Also : PM Kisan- Annadata Sukhibava : రైతులకు పండుగ గిఫ్ట్.. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్.. ఆ తేదీనే ఖాతాల్లోకి డబ్బులు?

ఫ్లిప్‌కార్ట్ 36 నెలలకు కేవలం రూ. 2,262 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. అంతేకాదు.. మీ పాత ఫోన్ ఇచ్చి రూ. 49,250 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందొచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.

ఐఫోన్ 16 ఇదే బెస్ట్ టైమ్? :
ఆపిల్ త్వరలో ఐఫోన్ల ధరలను భారీగా పెంచనుంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన లేదు. ఈ లీకులను విశ్వసిస్తే.. ఐఫోన్ 16 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరతో పోలిస్తే ప్రస్తుతం భారీ తగ్గింపుతో లభిస్తోంది.

ప్రస్తుత ధరకు 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్ అందిస్తుంది. బయట ఈ ఫోన్ వాడితే 2000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ చేరుకోగలదని కంపెనీ పేర్కొంది. అంతేకాదు.. A18 చిప్‌సెట్ ఉంది. 8GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. ఈ ఐఫోన్ iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. iOS 27 అప్‌డేట్‌తో పాటు వచ్చే సిరి ఏఐ ఫీచర్లకు కూడా సపోర్టు అందిస్తుంది.

కెమెరా ప్రియుల కోసం బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరాతో పాటు 12MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP సెన్సార్ కూడా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 3,561 mAh బ్యాటరీ ఉంది. 25W మ్యాగ్‌సేఫ్ 15W Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.