×
Ad

Apple iPhone 16 Price : మెగా డిస్కౌంట్! ఈ ఆపిల్ ఐఫోన్ 16 చాలా చీప్, ఇలా కొన్నారంటే..

Apple iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ధర తగ్గింది. ఐఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.

Apple iPhone 16 Price (Image Credit To Original Source)

  • ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 తగ్గింపు ధరకే
  • 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900
  • బ్యాంకు ఆఫర్లతో రూ.4వేల అదనపు డిస్కౌంట్

Apple iPhone 16 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఐఫోన్‌లో కెమెరా క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఒకవేళ మీరు ఐఫోన్‌ ఫస్ట్ టైమ్ కొనుగోలు చేస్తుంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఇతర ఐఫోన్లతో పోలిస్తే ఈ మోడల్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫీచర్లు, స్పెషిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.79,900 ఉండగా ఇప్పుడు తగ్గింపుతో రూ.64,900కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుపై రూ.4వేల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

తద్వారా ధర రూ.60,900కు తగ్గుతుంది. బ్లాక్, వైట్, పింక్, టీల్ అల్ట్రామెరైన్ అనే 5 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Apple iPhone 16 Price (Image Credit To Original Source)

Read Also : Apple iPhone 17 Pro Max : ఆపిల్ లవర్స్ డోంట్ మిస్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ఆపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో A18 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ ఐఫోన్ iOS18పై రన్ అవుతుంది. లేటెస్ట్ iOS 26.2 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. బేస్ మోడల్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 16లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఐఫోన్ 12MP ఫ్రంట్ స్నాపర్‌ కూడా ఉంది. 3562mAh బ్యాటరీ, 25W వైర్‌లెస్ (MAgSafe) ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.