Apple iPhone 16 : అద్భుతమైన డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 అతి చౌకైన ధరకే.. ఇంతకన్నా తక్కువకు మళ్లీ రాదు!

Apple iPhone 16 : ఐఫోన్ 16 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.. కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నవారికి బంపర్ ఆఫర్.. క్రోమాలో ఇలా కొన్నారంటే మీ బడ్జెట్ ధరలోనే ఇంటికి తెచ్చుకోవచ్చు..

Apple iPhone 16 price

  • ఆపిల్ ఐఫోన్ 16 భారీ తగ్గింపుతో లభిస్తుంది
  • ఈ ఐఫోన్ పవర్‌ఫుల్ ప్రాసెసర్, మంచి కెమెరాలు, ప్రీమియం ఫీచర్లు
  • ఐఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్

Apple iPhone 16 : ఆపిల్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో మీరు కొత్త ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. రూ. 79,900 ధరకు లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 16 ఇప్పుడు క్రోమాలో భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది.

బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌, A18 చిప్‌సెట్‌తో వస్తుంది. అంతేకాదు.. ఈ ఐఫోన్ కొత్త సిరి ఏఐకి కూడా సపోర్టు చేస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు ఐఫోన్ 16 కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. క్రోమా డీల్ ఎలా పొందాలో ఓసారి లుక్కేయండి.

క్రోమాలో ఐఫోన్ 16 ధర ఎంతంటే? :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రారంభ ధర నుంచి రూ. 13,410కు తగ్గింది. దాంతో ప్రస్తుతం ఈ ఐఫోన్ మోడల్ రూ. 66,490కి లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ. 3,130 నుంచి ఈఎంఐ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు. అదనంగా చెల్లిస్తే.. ఆపిల్ కేర్ సర్వీసులతో ప్రొటెక్ట్ ప్లస్ డివైజ్‌, ఆపిల్ కేర్ ప్లస్ కూడా ఎంచుకోవచ్చు.

Read Also : Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ అదిరే ఆఫర్.. లగ్జరీ ఫోన్ ఇప్పుడు బడ్జెట్ రేట్‌లో..!

ఆపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే స్క్రీన్‌తో వస్తుంది. ఆపిల్ A18 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఐఫోన్ iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది iOS 27 అప్‌డేట్‌, సిరి ఏఐ ఫీచర్లతో వస్తుంది.

ఈ ఐఫోన్ 3561mAh బ్యాటరీతో వస్తుంది. 25W మ్యాగ్‌సేఫ్ 15W క్యూఐ2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే.. సెన్సార్-షిఫ్ట్ OISతో 48ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. 12ఎంపీ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.

ఐఫోన్ 16 కొనాలా? వద్దా? :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ రూ. 67వేల లోపు ధరలో లభిస్తోంది. ఈ ఐఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రొఫెషనల్-గ్రేడ్ షూటింగ్ ఉంది. డిస్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ఐఫోన్ 16పై అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.