×
Ad

iPhone 16 Pro Max : ఈ ఐఫోన్ క్రేజ్ అంతే.. ఏకంగా రూ. 50వేలకు పైగా డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ దొరకదు.. ఇప్పుడే కొనేసుకోండి!

iPhone 16 Pro Max : ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఆఫర్ అదిరింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఐఫోన్ మోడల్ ఏకంగా రూ. 50వేలకు పైగా తగ్గింపు పొందింది. ఈ క్రేజీ డీల్ మీకోసమే..

1/7
iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 20న ఆపిల్ భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను రూ. 1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది.
2/7
ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు, అద్భుతమైన కెమెరా సామర్థ్యాలు, టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అయితే, ఈ ఏడాదిలో అదే ఐఫోన్ ఇప్పటివరకు అత్యల్ప ధరకు అమ్ముడవుతోంది. ఆన్‌లైన్‌లో ఐఫోన్ 16 ప్రో రూ. 50వేల లోపు ధర కన్నా ఎక్కువ తగ్గింపు పొందింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/7
ఐఫోన్ 16 ప్రో మాక్స్.. విజయ్ సేల్స్ డీల్ : ఆపిల్ ఐఫోన్లలో ప్రీమియం, హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లుగా చెప్పవచ్చు. లాంచ్ సమయంలో భారీ ధర తగ్గుదల ఉంటుందని భావించారు. అయితే, విజయ్ సేల్స్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను రూ.94,490కి లిస్ట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర అసలు లాంచ్ ధర నుంచి రూ.50,410 తగ్గింది.
4/7
అన్ని డిస్కౌంట్లు, ఐసీఐసీఐ ఆఫర్లు : మీరు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకుల క్రెడిట్ కార్డులను వాడితే ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ (EMI లావాదేవీ)తో కొనుగోలుదారులు రూ. 3వేల వరకు ఇన్‌స్టంట్ 5శాతం తగ్గింపు పొందవచ్చు. అదనంగా, ఈఎంఐ లేని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలు రూ. 2వేల వరకు 5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తాయి.
5/7
బ్యాంకు డిస్కౌంట్లు : ఆసక్తిగల యూజర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. టైమ్ లిమిట్ బట్టి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులు రూ.500 నుంచి రూ.4వేల వరకు ఈఎంఐ లావాదేవీలపై ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌లను అందిస్తాయి. వినియోగదారులు 6 నెలలు అంతకన్నా ఎక్కువ ఈఎంఐ ప్లాన్‌లపై 7.5శాతం (గరిష్టంగా రూ.3వేలు) వరకు శాతం ఆధారిత డిస్కౌంట్‌లను పొందవచ్చు. మీ బడ్జెట్‌లో ఐఫోన్ కొనాలని ప్లాన్ చేసే వారికి ఈ ఆఫర్లు అత్యంత ఆకర్షణీయంగా చేస్తాయి.
6/7
ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు : 2024లో వచ్చిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ (HBM)తో కూడిన 6.9-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. iOS 18లో రన్ అవుతుంది.
7/7
ఈ ఐఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్, 48MP+12MP+48MP మాదిరిగా 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 25W వైర్‌లెస్ (MagSafe) ఛార్జింగ్ సపోర్ట్‌తో 4685mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. స్టోర్ డిస్‌ప్లే యూనిట్ ఈ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డీల్ స్టోర్ డిస్‌ప్లే యూనిట్‌కు వర్తిస్తుంది. 256GB స్టోరేజీ డెసర్ట్ టైటానియం కలాయిర్ వేరియంట్‌లో లభిస్తుంది.