×
Ad

Apple iPhone 17 : ఇది కదా ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 17పై అద్భుతమైన డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువ ధరకే..!

Apple iPhone 17 : ఐఫోన్ 17 కొనేవారికి గుడ్ న్యూస్.. విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 17 కొనుగోలుపై ఖతర్నాక్ డీల్ అందిస్తోంది.

Apple iPhone 17

Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ అభిమానుకుల అదిరిపోయే డిస్కౌంట్.. విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 17పై బిగ్ డీల్ అందిస్తోంది. ఈ సేల్ సందర్భంగా ఐఫోన్ 17 మోడల్ రూ.77వేలు లోపు ధరకే లభిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో పాటు బేస్ వేరియంట్ ఐఫోన్ 17 రూ.82,900 ధరకు లాంచ్ అయింది.

ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేతో (Apple iPhone 17) వచ్చింది. లేటెస్ట్ ఐఫోన్ మోడల్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఆపిల్ ఐఫోన్ 17పై డిస్కౌంట్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 17 డీల్ :
ఆపిల్ ఐఫోన్ 17 అన్ని రకాల లావాదేవీలపై ICICI, SBI, IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.6వేలు డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఇంకా, HDFC, HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈఎంఐ లావాదేవీలపై రూ.4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా, కొనుగోలుదారులు కొత్త ఐఫోన్ 17పై డిస్కౌంట్ కోసం పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Apple iPhone 15 Price : సూపర్ ఆఫర్ భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 15 అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇంత తక్కువకు మళ్లీ దొరకదు..!

ఆపిల్ ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 17లో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఉన్నాయి. 3,000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఆపిల్ లేటెస్ట్ ఆపిల్ చిప్‌సెట్ A19తో వస్తుంది. ఈ ఐఫోన్ 8GB ర్యామ్ కలిగి ఉంది. అల్యూమినియం ఫ్రేమ్, ఆపిల్ వై-ఫై 7 చిప్‌ను కలిగి ఉంటుంది.

ఐఫోన్ 16తో పోలిస్తే.. 6 గంటలు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. కెమెరా సెటప్ కూడా అప్‌గ్రేడ్ అయింది. ఆపిల్ “డ్యూయల్ ఫ్యూజన్” సిస్టమ్ కలిగి ఉంది. 48MP ప్రైమరీ సెన్సార్‌ను ఇంటర్నల్ 2x టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. కొత్త 48MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ 18MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.