×
Ad

Republic Day Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌పై ఖతర్నాక్ డీల్స్.. ధర ఎంత తగ్గిందంటే?

Republic Day Sale : ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలు భారీగా తగ్గాయి. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి.. ఈ డీల్స్ ఎలా పొందాలంటే? (Image Credit To Original Source)

1/7
Republic Day Sale : ఆపిల్ లవర్స్ కోసం అదిరిపోయే డిస్కౌంట్.. ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం రిపబ్లిక్ డే సేల్ నడుస్తోంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
2/7
లేటెస్ట్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫోన్లపై భారీ తగ్గింపు పొందవచ్చు. విజయ్ సేల్స్‌లో రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. ఈ ఐఫోన్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/7
విజయ్ సేల్స్‌పై ఐఫోన్ 17 డీల్ ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17 మోడల్ రూ.82,900 ధరకు లిస్ట్ అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.7,500 వరకు 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ.4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా తగ్గింపు ధరకే ఐఫోన్ 17 ఇంటికి తెచ్చుకోవచ్చు.
4/7
అమెజాన్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ డీల్ : ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మాక్స్ కూడా అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. రూ. 1,49,900 ధరకు లాంచ్ అయిన ఈ ఐఫోన్ ప్రస్తుతం రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్, అదనంగా రూ. 6,500 కూపన్‌తో లభిస్తోంది. తద్వారా ధర రూ. 1,40,400కి తగ్గుతుంది. మొత్తం రూ. 9,500 సేవ్ చేసుకోవచ్చు.
5/7
ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో ఆపిల్ A19 చిప్‌పై రన్ అవుతుంది. IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. 48MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్, 18MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
6/7
ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు : ఐఫోన్ ప్రో మాక్స్ 6.9-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో వస్తుంది. A19 ప్రో చిప్, 12GB ర్యామ్, 256GB స్టోరేజీ కూడా ఉంది.
7/7
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48MP వైడ్, 48MP అల్ట్రా-వైడ్, 4x ఆప్టికల్ జూమ్‌తో 48MP పెరిస్కోప్ టెలిఫోటో, ప్రోరేస్, ఆపిల్ లాగ్ స్పేషియల్ వీడియో వంటి ప్రో వీడియో ఫీచర్లు ఉన్నాయి.