Apple iPhone 17 Pro Max : వావ్.. ఆఫర్ అదిరింది మావా.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. జస్ట్ ఎంతంటే?

Apple iPhone 17 Pro Max : ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గింది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఐఫోన్ రూ. 1,45,490 ధరకు లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 17 Pro Max

  • భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రూ. 1,49,900 ధరకు లాంచ్
  • విజయ్ సేల్స్‌లో ఐఫోన్ రూ. 1,45,490 ధరకు లిస్టింగ్, రూ. 4,410 నేరుగా తగ్గింపు
  • బ్యాంకు ఆఫర్లతో ఐఫోన్ కొనుగోలుపై మరింత ఆదా

Apple iPhone 17 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ప్రీమియం ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. విజయ్ సేల్స్‌లో ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మాక్స్‌పై రూ. 10,400 పైగా డిస్కౌంట్ అందిస్తోంది.

భారత మార్కెట్లో రూ. 1,49,900 ధరకు లాంచ్ అయిన ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల డిస్‌ప్లే, A19 ప్రో చిప్‌సెట్, 48MP ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్‌తో పాటు అనేక ఇతర ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రూ. 1,49,900 ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 1,45,490 ధరకు లిస్ట్ అయింది. రూ. 4,410 నేరుగా ధర తగ్గింపు పొందవచ్చు.

హెచ్ఎస్‌బీఎస్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 6వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 4,500 డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Gold Price Today : పండగ చేస్కోండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత తగ్గిందో తెలుసా?

ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 6.9-అంగుళాల 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఐఫోన్ A19 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఆపిల్ ప్రకారం ఈ ఐఫోన్ 39 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో ఫ్రంట్ సైడ్ 18MP కెమెరా కూడా ఉంది.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొనాలా? వద్దా?
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కొత్త ఐఫోన్ ప్రో మోడల్స్ లాంచ్ కానున్నాయి. అంతకన్నా ముందుగానే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనేసుకోవడం బెటర్.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ పవర్‌ఫుల్ A19 ప్రో చిప్‌సెట్, 48MP ట్రిపుల్-కెమెరా సిస్టమ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. మీ ఐఫోన్ అప్ గ్రేడ్ చేయాలనుకుంటే ఈ ఐఫోన్ మోడల్ తీసుకోవచ్చు. ఏదైనా సేల్ సమయంలో ఇదే ఐఫోన్ ఇంతకన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.