iPhone 17 Pro : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో భారీగా తగ్గిందోచ్.. ఇంత కన్నా తక్కువకు మళ్లీ దొరకదు!

Apple iPhone 17 Pro : కొంటే ఆపిల్ ఐఫోన్ కొనాలి భయ్యా.. ఇప్పుడు కానీ కొన్నారంటే చాలా తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ఎంత తగ్గిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1/6
Apple iPhone 17 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ అవ్వాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. విజయ్ సేల్స్ ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఇప్పుడు మీరు కొంటే ఏకంగా రూ. 8,000 కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు.
2/6
రూ. 1,32,900 ధరకు లాంచ్ అయిన ఐఫోన్ 17 ప్రో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే, A19 ప్రో చిప్‌సెట్, 48MP ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్‌తో పాటు అనేక ఇతర హై-ఎండ్ ఫీచర్లతో వస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. కొనాలని అనుకుంటే ఈ డీల్ ఇప్పుడే సొంతం చేసుకోండి.
3/6
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో రూ. 1,34,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 1,32,490కి లిస్ట్ అయింది. రూ. 2,410 నేరుగా ధర తగ్గింపు పొందవచ్చు. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 6వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. HSBC కార్డ్ లేని యూజర్లు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ. 4,500 డిస్కౌంట్ పొందవచ్చు.
4/6
ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, 12GB వరకు ర్యామ్‌తో A19 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 120Hz ప్రోమోషన్ టెక్నాలజీ, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే, యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో 6.3-అంగుళాల OLED ప్యానెల్ ఉంది. సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ కూడా ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 39 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
5/6
కెమెరాల విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రో బ్యాక్ సైడ్ 48MP ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 48MP ఫ్యూజన్, 48MP అల్ట్రావైడ్, 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 8x వరకు ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 18MP కెమెరా కూడా ఉంది.
6/6
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనాలా? వద్దా? : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో లైనప్ సెప్టెంబర్ 2026లో లాంచ్ కానుంది. ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో తీసుకోవడం అంటే పాత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ తక్కువ ధరకు పొందడమే. ఇందులో A19 ప్రో చిప్, 48MP ట్రిపుల్-కెమెరా సిస్టమ్, 8K వీడియో రికార్డింగ్ ఆప్షన్లు ఉంటాయి. మీకు మంచి ట్రేడ్-ఇన్ ఆఫర్ ఉంటే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఏదైనా మెగా సేల్ ఈవెంట్ ఉంటే ఈ ఐఫోన్ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంత కన్నా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.