Apple iPhone 17 Pro : వావ్.. ఖతర్నాక్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 17 ప్రో.. ఏకంగా రూ. 10వేలు ఆదా.. ఎలాగంటే?
Apple iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో అతి తక్కువ ధరకే వస్తోంది. విజయ్ సేల్స్ సమయంలో ఐఫోన్ 17 ప్రో మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- April 20, 2026 / 05:26 PM IST
Apple iPhone 17 Pro : ఆపిల్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్. మీరు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో అతి చౌకైన ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఐఫోన్ కొనుగోలుపై విజయ్ సేల్స్ రూ. 10వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది.
దేశ మార్కెట్లో రూ. 1,34,900 ధరకు లాంచ్ అయిన ఈ ఐఫోన్‌లో 6.3-అంగుళాల డిస్‌ప్లే, ఆపిల్ A19 ప్రో చిప్, 48MP ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్‌తో పాటు ఇతర హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ఇలాంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు సాధారణంగా ఎక్కువ రోజులు ఉండవు. ఆసక్తిగల కొనుగోలుదారులు వెంటనే కొనేసుకోవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో రూ. 1,34,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 1,30,890కి లిస్ట్ అయింది. అసలు ధరపై రూ. 4,010 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్దోంది.
మీరు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 6వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 4,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, 12GB వరకు ర్యామ్‌తో A19 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 120Hz ప్రోమోషన్ టెక్నాలజీ, యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో 6.3-అంగుళాల OLED స్క్రీన్ ఉంది. సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రో బ్యాక్ సైడ్ 48MP ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP మెయిన్, 48MP అల్ట్రావైడ్, 48MP టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. 8x వరకు ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 18MP కెమెరా ఉంది.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనాలా? వద్దా? : వచ్చే సెప్టెంబర్ 2026లో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ రానుంది. అయితే, అంతకన్నా ముందే ఆపిల్ ఐఫోన్ 17 ప్రోను తగ్గింపు ధరకే అందిస్తోంది. A19 ప్రో ప్రాసెసర్, 48MP ట్రిపుల్-కెమెరా సెటప్, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.
మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌పై ట్రేడ్-ఇన్ ఆఫర్‌తో పాటు ఈ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అప్‌గ్రేడ్ లేదంటే ఏదైనా పండగ సేల్ సమయంలో ఈ ఐఫోన్ ఇంకా తగ్గింపు ధరకే లభించే అవకాశం ఉంది.
