×
Ad

Apple iPhone 17 Pro : డిస్కౌంట్ అదిరింది బ్రో, ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై బిగ్ డిస్కౌంట్, ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు

Apple iPhone 17 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కోసం చూస్తున్నారా? ఐఫోన్ 17 ప్రో ఏకంగా రూ. 7వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 24, 2026 / 11:54 AM IST
1/6
Apple iPhone 17 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్.. కొనుగోలుదారులు మొత్తం రూ. 7వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ తో అదనపు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ పవర్‌ఫుల్ ప్రాసెసర్, అదిరిపోయే డిస్‌ప్లే , హై క్వాలిటీ కెమెరాలను అందిస్తుంది. మీరు లేటెస్ట్ ఐఫోన్ 17 ప్రో కొనాలని చూస్తున్నారా? ఇదే బెస్ట్ టైమ్.
2/6
ప్రస్తుతం విజయ్ సేల్స్ ఈ ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై భారీ తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, A19 ప్రో ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17 ప్రోపై డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ధర తగ్గింపు : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో రూ.1,34,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం, ఈ స్మార్ట్‌ఫోన్ విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో కేవలం రూ.1,32,490 ధరకు అందుబాటులో ఉంది.
4/6
రూ.2,410 ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌తో ఈఎంఐ రూ.5వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ చేస్తుంటే.. ఇ-కామర్స్ బ్రాండ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ మొత్తం పాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్లపై ఆధారపడి ఉంటుంది.
5/6
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో A19 ప్రో ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. గరిష్టంగా 12GB ర్యామ్ సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 17 ప్రో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz ప్రోమోషన్, ఆన్‌లో ఉండే డిస్‌ప్లే యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌కు సపోర్టు ఇస్తుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం ఆపిల్ సిరామిక్ షీల్డ్ 2 అమర్చారు. ఐఫోన్ 17 ప్రో సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 39 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.
6/6
ఫొటోగ్రాఫర్ల విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో బ్యాక్ సైడ్ 48MP ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 48MP ఫ్యూజన్ లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 8x ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టుతో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఐఫోన్ 17 ప్రోలో 18MP కెమెరా ఉంది.