iPhone 18 Series : ఆపిల్ లవర్స్‌కు డబుల్ ధమాకా.. ఐఫోన్ 18 ప్రోతో ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్! ధర, ఫీచర్లు లీక్
iPhone 18 Series : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ వస్తోందోచ్.. ఈసారి ఐఫోన్లతో పాటు ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ కూడా రాబోతుంది. పూర్తి లీక్ ధరలివే..
- Sreehari A
- Published on- September 6, 2026 / 01:04 PM IST
iPhone 18 Series
- అతి త్వరలో ఆపిల్ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది
- ఐఫోన్ 18 సిరీస్ రాబోతుంది.. ధరలు ముందే లీక్
- ఫోల్డబుల్ ఫోన్ సహా ఇతర ఐఫోన్ల ధరలు భారీగా పెరిగే ఛాన్స్
iPhone 18 Series : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. అతి త్వరలో ఆపిల్ మెగా ఈవెంట్ మొదలుకానుంది. ఆపిల్ నెక్స్ట్ ఐఫోన్ లాంచ్ ముందే ధరల వివరాలు రివీల్ అయ్యాయి. రాబోయే కొత్త ఐఫోన్లలో ఐఫోన్ అల్ట్రా, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధరలు వొడాఫోన్ ఈజిప్ట్ వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ఐఫోన్ల ధరలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లీకైన ధరలు, గత మోడళ్ల ధరలతో ఐఫోన్ 18 సిరీస్‌లో భారీ పెంపు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ అత్యంత ఖరీదైనదిగా ఉండొచ్చు. ఐఫోన్ అల్ట్రాగా రాబోతుంది. ఐఫోన్ 18 ప్రో ప్రో మాక్స్ ధరలు సుమారు 10శాతం మేర పెరిగే అవకాశం ఉండగా, ఐఫోన్ అల్ట్రా ధర దాదాపు రూ. 2.47 లక్షలు ఉండొచ్చు. పూర్తి వివరాలివే..
ఐఫోన్ అల్ట్రా ధర ఎంతంటే? :
ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ ఈసారి ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలువనుంది. వొడాఫోన్ ఈజిప్ట్ వెబ్‌సైట్ ఈ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ ధరను EGP 155,750గా చూపించింది. కానీ, ఆ తర్వాత డిలీట్ చేసింది.
అంటే.. ఈ ఐఫోన్ అల్ట్రా ధర సుమారు 1,980 డాలర్లు లేదా రూ.2,47,500గా ఉంటుందని అంచనా. ఈ ధర శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్8 వంటి ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్లకు ధరలకు దగ్గరగా ఉంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 ప్రారంభ ధర అమెరికాలో 1,900 డాలర్లు ఉండగా, భారత మార్కెట్లో ధర రూ.1,80,000గా ఉండేది.
Read Also : Credit Card Rules : మీ చేతిలో క్రెడిట్ కార్డు ఉన్నా లాంగ్ టైమ్ వాడకపోతే ఏమౌతుంది? ఏమైనా ఛార్జీలు పడతాయా?
256GB మోడల్ ధర ఎంత? :
ఐఫోన్ అల్ట్రా అంచనా ధరపై ఆస్ట్రేలియా రిపోర్టు ప్రకారం 256GB మోడల్ ధర రూ. 2,50,000గా ఉండొచ్చు. 512GB 1TB వేరియంట్ల ధరలు సుమారుగా రూ.2,85,600 నుంచి రూ.3,19,600గా మధ్య ఉండవచ్చని సమాచారం.
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ ధర :
ఫోల్డబుల్ మోడల్‌తో పాటు, ఐఫోన్ 18 ప్రో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరలు రివీల్ అయ్యాయి. వొడాఫోన్ ఈజిప్ట్ లిస్టు ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో ధర రూ.1,81,800గా ఉంటే.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర రూ.1,94,800గా ఉంది. ఐఫోన్ 18 ప్రో ధర సుమారు 10శాతం, ప్రో మ్యాక్స్ ధర సుమారు 11శాతం పెరిగింది.
9నే ఆపిల్ ఈవెంట్ :
సెప్టెంబర్ 9న జరిగే ఆపిల్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఆవిష్కరించనుంది. నివేదికల ప్రకారం.. ఈ ఈవెంట్‌లో ఆపిల్ కొత్త ప్రో మోడళ్లను ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేయనుంది. అయితే, ఐఫోన్ 18 వచ్చే ఏడాది లాంచ్ కావచ్చు. ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 11న ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ ఐఫోన్ అల్ట్రా ధరలు లీక్ అయ్యాయి.
