Apple iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో డిజైన్ లీక్.. ఫ్రంట్ సైడ్ భారీ మార్పులు.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
Apple iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో డైనమిక్ ఐలాండ్ 25 శాతం నుంచి 30 శాతం వరకు చిన్నదిగా ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- May 4, 2026 / 08:44 PM IST
Apple iPhone 18 Pro
- ఐఫోన్ 18 ప్రోలో 2nm ప్రాసెస్, A20 SoC చిప్‌సెట్
- కంపెనీ లేజర్ మైక్రో డ్రిల్లింగ్, చిన్న డైనమిక్ ఐలాండ్
- ఫేస్ ఐడి ఇన్‌ఫ్రారెడ్ ఇల్యూమినేటర్ డిస్‌ప్లే ఆప్షన్
Apple iPhone 18 Pro : ఆపిల్ లవర్స్‌కు బిగ్ అప్‌డేట్.. అతి త్వరలో ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ కాబోతుంది. అంతకన్నా ముందే ఈ ఐఫోన్ 18 ప్రో లీకులు బయటకు వచ్చాయి.కంపెనీ ఈ సిరీస్‌ను సుమారుగా సెప్టెంబర్ 2026లో లాంచ్ చేయనుంది.
కానీ, ఇప్పటికే అన్ని మోడళ్లకు సంబంధించిన లీకులు రివీల్ అయ్యాయి. లేటెస్ట్ అప్‌డేట్ ఐఫోన్ 18 ప్రో కూడా రాబోతుంది. డిజైన్ కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి, ఈ ఐఫోన్‌లో చిన్న డైనమిక్ ఐలాండ్ ఉండవచ్చు. ఇంకా ఎలాంటి మార్పులు ఉండనున్నాయో పూర్తి వివరంగా పరిశీలిద్దాం…
ఐఫోన్ 18 ప్రో డిజైన్ లీక్ అయినట్లు సమాచారం. ఆపిల్ ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో డైనమిక్ ఐలాండ్‌లో భారీ మార్పులు ఉండవచ్చు. ఈ ఫోన్ సింగిల్ ప్రోటోటైప్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఫ్రంట్ సైడ్ కీలక మార్పును సూచిస్తోంది. గతంలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ డిజైన్ కూడా లీక్ అయింది. ప్రో వేరియంట్‌లో కూడా ఇలాంటి డైనమిక్ ఐలాండ్ కనిపిస్తుంది. ఈ డైనమిక్ ఐలాండ్ 25 నుంచి 30శాతం వరకు చిన్నదిగా ఉండవచ్చని అంచనా.
సప్లై చైన్ ఇన్‌సైట్స్ ప్రకారం.. :
ఫేస్ ఐడీ ఇన్‌ఫ్రారెడ్ ఇల్యూమినేటర్‌ను డిస్‌ప్లే కింద డైనమిక్ ఐలాండ్ సైజు భారీగా తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. కెమెరా, డాట్ ప్రొజెక్టర్ షేప్ ఉండే ఐలాండ్ డైనమిక్ ఐలాండ్‌లోనే ఉంటాయి. డిస్‌ప్లే కారణంగా సెన్సార్ కచ్చితత్వం దెబ్బతినకుండా ఉండేందుకు కంపెనీ లేజర్ మైక్రో-డ్రిల్లింగ్‌ను వాడనుంది.
2027లో ఐఫోన్ 20 మోడల్ లాంచ్ :
అయితే, ఆపిల్ ఐఫోన్ 20 మోడల్ 2027లో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. యూజర్ల కోసం ప్రత్యేకించి సరికొత్త డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. అత్యంత స్పెషల్ ఐఫోన్ మోడల్ అవుతుందని భావిస్తున్నారు.
ఐఫోన్ 18 ప్రో బ్యాక్ డిజైన్ పాత ఐఫోన్ 17 ప్రో మాదిరిగానే ఉంటుందని అంటున్నారు. అప్‌గ్రేడ్‌లు ఐఫోన్ లోపల మాత్రమే కనిపిస్తాయి. కెమెరాలో భారీ అప్‌గ్రేడ్ ఉండొచ్చు. రాబోయే ఐఫోన్‌లో మెరుగైన డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆపిల్ ఐఫోన్ 18 ప్రోలో 2nm ప్రాసెస్‌పై కంపెనీ A20 SoC చిప్‌సెట్‌ను అమర్చనున్నట్లు అంచనా. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ మోడళ్లు సెప్టెంబర్ 2026లో లాంచ్ కానున్నాయి.
