iPhone 18 Pro Series : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. కొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
iPhone 18 Pro Series : కొత్త ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్ రాబోతుంది. లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్ సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published On : April 7, 2026 / 04:35 PM IST
iPhone 18 Pro Series
- సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 10 మధ్య ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్
- భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో ధర సుమారు రూ. 1,34,900గా ఉంటుందని అంచనా
- ప్రో మాక్స్ మోడల్ ధర సుమారు రూ. 1,54,900 నుంచి ఉండే అవకాశం
iPhone 18 Pro Series : ఐఫోన్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 18 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ టెక్ దిగ్గజం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అనేక పుకార్లు, లీక్‌లను పరిశీలిస్తే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మోడళ్లు భారీ అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉంది. భారత ధరల నుంచి స్పెసిఫికేషన్ల వరకు ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్ల గురించి పూర్తి లీక్ వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ 18 ప్రో : భారత్ లాంట్ డేట్, ధర (అంచనా)
ఆపిల్ సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 10 మధ్య ఐఫోన్ 18 ప్రో మోడళ్లను ఆవిష్కరించనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ధర విషయానికొస్తే.. భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో ధర సుమారు రూ. 1,34,900గా ఉంటుందని అంచనా వేయగా, ప్రో మ్యాక్స్ ధర సుమారు రూ. 1,54,900 నుంచి ప్రారంభమవుతుందని అంచనా.
ఐఫోన్ 18 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, A20 ప్రో చిప్‌సెట్‌తో పాటు 12GB ర్యామ్, 1TB వరకు స్టోరేజ్‌తో వస్తుందని అంచనా. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్, 6.9-అంగుళాల OLED స్క్రీన్ అందించనుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో అద్భుతమైన జూమ్ సామర్థ్యాలతో 48MP ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఐఫోన్ 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుందని అంచనా.
ఐఫోన్ 18 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో అదే A20 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ అందిస్తుందని అంచనా. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేతో రావచ్చు. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ మోడల్‌కు సమానమైన కెమెరా స్పెసిఫికేషన్‌లతో వస్తుందని అంచనా.
