iPhone 18 Pro Max Leak : ఆపిల్ నుంచి మరో బిగ్ సర్ప్రైజ్.. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో ఇవే హైలెట్స్?
iPhone 18 Pro Max Leak : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందుగానే వేరబుల్ అప్రెచర్ అప్‌గ్రేడ్ అందించనుంది. ఈ అప్‌గ్రేడ్ కారణంగా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
iPhone 18 Pro Max Leak
- కొత్త సోనీ IMX905 సెన్సార్ 18 ప్రో మాక్స్‌లో ఉండనుంది
- కెమెరా ఫీచర్ ఐఫోన్లో ఫస్ట్ టైం కంపెనీ అందించనుంది
- కంపెనీ 2026 సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ చేసే ఛాన్స్
iPhone 18 Pro Max Leak : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు బిగ్ అప్డేట్.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రాబోతుంది. అయితే, ఈ కొత్త ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ కాకముందే ఫీచర్ల వివరాలు రివీల్ అయ్యాయి.
ముఖ్యంగా ఐఫోన్ ఫ్యాన్స్ ఈ టాప్-ఎండ్ వేరియంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీకుల ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కెమెరాను (iPhone 18 Pro Max Leak) అప్‌గ్రేడ్ చేయబోతోంది. ఈ అప్‌గ్రేడ్ ఫొటో, వీడియో క్వాలిటీని మరింత అప్‌గ్రేడ్ చేస్తుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
ముఖ్యంగా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కెమెరా వివరాలు లీక్ అయ్యాయి. అంచనాల ప్రకారం.. ఈ కొత్త ఐఫోన్ 18 సిరీస్‌ను కంపెనీ 2026 సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కెమెరా వేరియబుల్ అపెర్చర్‌తో వస్తుందని నివేదిక పేర్కొంది.
ఈ లీక్ డయాగ్నస్టిక్ లాగ్‌లో రివీల్ అయింది. నోట్బుక్చెక్ రిపోర్టు ప్రకారం.. ‘వరల్డ్ లీక్స్’ అనే ర్యాన్సమ్వేర్ గ్రూప్ ద్వారా జూన్‌లో ఆన్లైన్లో లీక్ అయింది. ఈ లీక్ ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మెయిన్ సెన్సార్ వేరియబుల్ అపెర్చర్‌తో వస్తుంది.
Read Also : Motorola Edge 60 Pro : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఫోన్ మరి ఇంత తక్కువా? ఎలా కొనాలంటే?
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కొత్త మెయిన్ కెమెరా సెన్సార్‌తో రానుంది. సోనీ IMX905 సెన్సార్ వస్తుందని అంచనా. ఈ సెన్సార్ సైజు 1.22μm వద్ద ఉంటుంది. ఇతర మెయిన్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల ఫ్లాగ్షిప్ ఫోన్లలో వేరియబుల్ అపెర్చర్ ఉన్నా ఐఫోన్లో ఇదే ఫస్ట్ టైమ్ అందించనుంది. ఈ ఐఫోన్ కెమెరా సెటప్‌లోని ఇతర స్పెసిఫికేషన్లు గత మోడల్ మాదిరిగానే ఉంటాయని నివేదిక చెబుతోంది.
ఈ ఐఫోన్లో సోనీ IMX973 సెన్సార్‌తో టెలిఫోటో కెమెరా ఉంటుందని అంచనా. అల్ట్రావైడ్ కెమెరాలో సోనీ IMX972 సెన్సార్, LiDAR రిసీవర్లో సోనీ IMX591 సెన్సార్, సెల్ఫీ కెమెరాలో సోనీ IMX914 సెన్సార్ ఉంటాయి. ఇవన్నీ ఐఫోన్ 17 ప్రో మాక్స్లోనూ ఉన్నాయి.
ఈ లీక్‌పై ఆపిల్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే, రాబోయే ఈ అప్‌గ్రేడ్ కారణంగా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత కారణంగా ఆపిల్ అతిపెద్ద ఫ్లాగ్షిప్ ఫోన్ అధిక ధరకే లాంచ్ కావొచ్చు.
