iPhone 18 Pro Price : వావ్.. కొత్త ఆపిల్ ఐఫోన్ 18 ప్రో అదుర్స్.. ఆన్‌లైన్‌లో ధర వివరాలు లీక్..!
iPhone 18 Pro Price : వచ్చే సెప్టెంబర్‌లో ఆపిల్ మెగా ఈవెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రాను కంపెనీ ఆవిష్కరించాలని భావిస్తోంది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- August 1, 2026 / 09:07 PM IST
iPhone 18 Pro Price
- ఆపిల్ ఐఫోన్ 18 ప్రో ఫీచర్లు లీక్
- సెప్టెంబర్ మెగా ఈవెంట్‌లో ఐఫోన్ 18 సిరీస్ లాంచ్
- ఫస్ట్ ఫోల్డబుల్ అల్ట్రా ఫోన్ కూడా ఆవిష్కరించే ఛాన్స్
iPhone 18 Pro Price : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది. వచ్చే సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో పాటు ఐఫోన్ 18 ప్రో కూడా లాంచ్ చేయనుంది. ఈ బ్రాండ్ ఫస్ట్ ఫోల్డబుల్ అల్ట్రా ఫోన్ కూడా రానుంది. ఈ ఐఫోన్ సంబంధించిన లీకులు ఎక్కువగా వస్తున్నాయి. రాబోయే ఐఫోన్ ప్రో మాక్స్ వేరియంట్ ధరతో పాటు ఈ ఫోన్ తాత్కాలిక ధర కూడా రివీల్ అయింది.
ఐఫోన్ 18 ప్రో ధరలు (అంచనా ) :
నివేదికల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ గత మోడళ్ల కన్నా వరుసగా సుమారు 250 డాలర్ల నుంచి 300 డాలర్ల అధిక ధరలతో మార్కెట్లోకి రావచ్చు. ఈ లెక్కన చూస్తే.. ఐఫోన్ 18 ప్రో భారత మార్కెట్లో రూ. 1,58,900 నుంచి రూ. 1,63,900 ధర మధ్య ఉండవచ్చు.
మరోవైపు, భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రూ. 1,73,700 నుంచి రూ. 1,78,900 మధ్య అందుబాటులో ఉండనుంది. అయితే, ఆపిల్ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఫోన్‌కు సంబంధించి ధర, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఐఫోన్ 18 ప్రో స్పెసిఫికేషన్లు, కెమెరా ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రోలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండవచ్చు. 2nm ప్రాసెస్‌పై ఆపిల్ A20 ప్రో చిప్‌సెట్‌తో రన్ కానుంది. లీకుల ప్రకారం.. ఈ చిప్‌సెట్ పర్ఫార్మెన్స్ చాలావరకు 15 శాతం ఫాస్ట్ ఉంటుంది. సుమారు 30 శాతం అద్భుతమైన పవర్ అందిస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్‌లో మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5100mAh బ్యాటరీ కూడా ఉండవచ్చు. ఐఫోన్ 18 ప్రో డిజైన్ అనేది గత మోడల్ మాదిరిగానే ఉండనుంది. కాస్మిక్ ఆరెంజ్ ఐఫోన్ 17 బాగా పాపులర్ కాగా ఈ ఫోన్ బ్రైట్ చెర్రీ కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా వస్తుందని పలు పుకార్లు సూచిస్తున్నాయి.
కెమెరాల విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రోలో 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రావైడ్-యాంగిల్ సెన్సార్, 48MP టెలిఫోటో సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 18MP స్నాపర్ ఉండొచ్చు.
