×
Ad

Apple iPhone Air : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Apple iPhone Air : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో ఏకంగా రూ. 14వేలు తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ ఖతర్నాక్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

1/5
Apple iPhone Air : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అతి త్వరలో ఐఫోన్ 18 సిరీస్‌ రాబోతుంది. అంతకన్నా ముందుగానే ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గింది. ఈ ఐఫోన్ ఎయిర్ మోడల్ అద్భుతమైన డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
2/5
అయితే, ఈ ఐఫోన్ ఎయిర్ 6.5-అంగుళాల OLED డిస్‌ప్లే, అడ్వాన్స్ ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్ ఆప్షన్ కలిగి ఉంది. ఐఫోన్ ఎయిర్ మోడల్ లాంచ్ అయిన సమయంలో అనేక మందిని ఆకర్షించింది. సన్నని ఛాసిస్ నుంచి లైన్ ప్రాసెసర్ వరకు ఈ ఐఫోన్ అన్ని ఫీచర్లు కలిగి ఉంది. అమెజాన్ ఇండియా ఈ ఐఫోన్ ఎయిర్ మోడల్ భారీ తగ్గింపు ధరకే ఆఫర్ చేస్తోంది.
3/5
అమెజాన్‌లో ఐఫోన్ ఎయిర్ డీల్ : అమెజాన్ ఇండియాలో ఐఫోన్ ఎయిర్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,09,990కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.1,19,900 కన్నా తక్కువకే పొందవచ్చు. అలాగే, ఆసక్తిగల యూజర్లు బ్యాంకులు, క్రెడిట్ కార్డులపై రూ.4వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఐఫోన్ స్కై బ్లూ, లైట్ గోల్డ్, స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్ అనే 4 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐఫోన్ కొనుగోలుపై రూ.14వేలు భారీ తగ్గింపు పొందవచ్చు.
4/5
ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ మోడల్ 6.5-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. ఈ ప్యానెల్ సిరామిక్ షీల్డ్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా ఉంది. ఈ ఫోన్ లిక్విడ్ గ్లాస్ థీమ్‌తో iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది.
5/5
3nm ప్రాసెస్ ఆధారంగా ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో బ్యాక్ సైడ్ సింగిల్ 48MP కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 18MP స్నాపర్‌ కలిగి ఉంది. 3149mAh బ్యాటరీతో పాటు 20W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.