Apple iPhone Air : ఆపిల్ లవర్స్ మీకోసమే.. ఐఫోన్ ఎయిర్ మీ బడ్జెట్ ధరలోనే.. ఇలాంటి ఆఫర్ లైఫ్‌లో మళ్లీ రాదు..!

Apple iPhone Air : ఐఫోన్ ఎయిర్ భారీగా తగ్గిందోచ్.. ఏకంగా రూ. 21వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్ ఇలా కొన్నారంటే సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు..

Apple iPhone Air ( Image Credit : AI )

  • బ్యాంక్ ఆఫర్లతో ఐఫోన్ ఎయిర్‌పై రూ. 21వేలకుపైగా తగ్గింపు
  • సన్నని తేలికైన డిజైన్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్
  • ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందొచ్చు

Apple iPhone Air : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ ఎయిర్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఆపిల్ అందించే ఐఫోన్లలో అత్యంత సన్నని మోడల్ ఇదే. ఈ ఐఫోన్ సన్నగా ఉన్నా భారీ బ్యాటరీ ఉంది. ఈ డివైజ్ ఫస్ట్ రూ. 1,19,900 ధరతో లాంచ్ అయింది.

కానీ, ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. 6.5-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు A19 చిప్‌సెట్ (Apple iPhone Air) కూడా ఉంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ చౌకైన ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

విజయ్ సేల్స్‌లో ఐఫోన్ ఎయిర్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ రూ. 1,19,900 ధరతో ప్రారంభమైంది. అయితే, ప్రస్తుతం ఈ ఐఫోన్ విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 21,110 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ధర రూ. 98,790కి తగ్గింది. ఎస్‌బీఐ, యాక్సిస్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో తగ్గింపు ధరపై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ. 95వేల లోపుకు వస్తుంది.

Read Also : Samsung Galaxy S25 FE : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్..!

6 నెలల చొప్పున నెలకు కేవలం రూ. 15,798 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ అందిస్తోంది. పాత డివైజ్‌ ఎక్స్చేంజ్ చేస్తే.. ఈ బ్రాండ్ వారికి ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా అందిస్తోంది. అయితే, ఎక్స్ఛేంజ్, కచ్చితమైన వాల్యూ, మీ పాత డివైజ్, బ్రాండ్, మోడల్, పర్ఫార్మెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.

ఐఫోన్ ఎయిర్ కొనాలా? వద్దా? :
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. సన్ లైటింగ్ పడినా 3000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది.

ఆపిల్ సొంత A19 చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 3,100mAh బ్యాటరీ ఉంది. 20W వైర్డ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ ఎయిర్ మ్యాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్‌తో ఛార్జ్ చేస్తే 12W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే..
ఐఫోన్ ఎయిర్ బ్యాక్ సైడ్ 48MP ఫ్యూజన్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 18MP కెమెరాతో వస్తుంది. అంతేకాదు.. ఈ స్మార్ట్‌ఫోన్ 5.6mm మందంతో సుమారు 165 గ్రాముల బరువుతో వస్తుంది. ఆపిల్ అందించే ఐఫోన్లలో అత్యంత సన్నని తేలికైన ఫోన్ ఇదే.

మీరు ఈ ఐఫోన్ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్. చాలా లైట్ వెయిట్ ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. లేదంటే ఐఫోన్ 16 ప్రో తీసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, షావోమీ 14 అల్ట్రా ఫస్ట్ ఆండ్రాయిడ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.