Apple iPhone Deals 2026 : అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. ఇలా కొన్నారంటే భారీ తగ్గింపు..!
Apple iPhone Deals 2026 : కొత్త ఐఫోన్ కొనాలా? ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 17 మోడళ్లలో మీకు ఏది కావాలి? అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ సమయంలో తగ్గింపు ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
- Sreehari A
- Published on- October 12, 2026 / 05:53 PM IST
Apple iPhone Deals 2026
- ఐఫోన్ 17 256GB వేరియంట్ రూ.86,999 ధర మాత్రమే
- బ్యాంకు ఆఫర్ల తర్వాత ఐఫోన్ 17 ధర రూ.81,999 వరకు
- అమెజాన్‌లో ఐఫోన్ 16 ధర రూ.73,749కి తగ్గింది
Apple iPhone Deals 2026 : ఆపిల్ లవర్స్ మీకోసమే.. ఐఫోన్లు భారీగా తగ్గాయి. పాత ఐఫోన్ల నుంచి కొత్త ఐఫోన్ మోడళ్ల వరకు తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 ప్రారంభంలో ఐఫోన్‌లు భారీ తగ్గింపులతో లభిస్తున్నాయి. కానీ, సేల్ ప్రారంభం తర్వాత ఐఫోన్ల ధరలు కొద్దిగా మారాయి.
ఆపిల్ కొత్త ఐఫోన్ 17 లైనప్, ఐఫోన్ 15, ఐఫోన్ 16 మోడల్‌లు రెండు ప్లాట్‌ఫారమ్‌లలోనూ ఇప్పటికీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. కానీ, డిస్కౌంట్లలో కొద్దిగా తగ్గాయి. మీరు అమెజాన్ సేల్, ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ అదిరే డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ధర రూ.81,999 :
ఫ్లిప్‌కార్ట్, బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 కోసం ఐఫోన్ 17 డీల్‌ను మార్చింది. 256GB వేరియంట్ అసలు ధర రూ.99,900 నుంచి ఇప్పుడు రూ.86,999కి తగ్గింది. ఈ ధరతో పాటు కస్టమర్లు క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించుకోవచ్చు.
ఇందులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.2వేలు తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.5వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఐఫోన్‌ను గరిష్టంగా రూ.81,999 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ధర రూ.63,999 :
మీరు కొంచెం పాత ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ.63,999గా ఉంది. ఈ ధరలో బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఫోన్ ప్రస్తుత లిస్టెడ్ ధర రూ.74,900. అదనంగా, మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.54,400 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
అమెజాన్‌లో ఐఫోన్ 16 ధర రూ.73,749 :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 16 డీల్ మారింది . ఈ ఐఫోన్ ప్రారంభ ధర కన్నా రూ. 2వేల నుంచి రూ.3వేలు ఎక్కువ పెరిగింది. కానీ, ఈ డీల్ ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉంది. ఐఫోన్ 16 బేస్ వేరియంట్ ధర రూ.76,999గా ఉండగా, ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.3,250 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. తద్వారా ధర రూ.73,749కి చేరింది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
