Apple iPhone Duo : క్రోమా బంపరాఫర్.. రూ.2,99,900 ఐఫోన్ డ్యూయో ఇప్పుడు తక్కువ ధరకే.. రూ.75 వేల వరకు బెనిఫిట్స్!
Apple iPhone Duo : ఆపిల్ ఐఫోన్ డ్యుయోపై క్రోమా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్, అదనపు బోనస్, టాటా న్యూ కాయిన్స్‌తో రూ.2,24,910కు ఎలా పొందవచ్చో తెలుసుకోండి.
- Sreehari A
- Published on- October 28, 2026 / 03:47 PM IST
Apple iPhone Duo Available
- రూ.2.25 లక్షల లోపే ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో
- ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఆఫర్ మీకోసం
- 512GB వేరియంట్ ధర రూ.3,24,900, 1TB మోడల్ రూ.3,74,900కు
Apple iPhone Duo : ఆపిల్ ఐఫోన్ కొనాలని చాలామందికి ఉంటుంది. అయితే, ఆ కంపెనీ ఐఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటంతో వెనకడుగు వేస్తుంటారు. ఇప్పుడు ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యుయోపై క్రోమా స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్లన్నీ వర్తిస్తే రూ.2,99,900 ప్రారంభ ధర ఉన్న ఈ ఐఫోన్‌ను రూ.2,25,000 లోపే సొంతం చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పాత ఐఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఎంతంటే? :
క్రోమా వివరాల ప్రకారం.. ఐఫోన్ డ్యుయో 256GB మోడల్‌పై పలు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గర ఐఫోన్ 15 (256GB) ఉంటే ఎక్స్ఛేంజ్ చేసి గరిష్ఠంగా రూ.38,000 వరకు వాల్యూ పొందవచ్చు. అయితే, పాత ఫోన్ కండిషన్‌ను బట్టి ఈ మొత్తం మారుతుంది.
అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో మరో రూ.12వేల వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అలాగే, హెచ్డీఎఫ్సీ టాటా న్యూ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.24,990 వరకు టాటా న్యూ కాయిన్స్ లభించవచ్చని కంపెనీ పేర్కొంది.
Read Also : Motorola Edge 70 Neo : వావ్.. ఇది కదా ఫోన్.. 7,000mAh బ్యాటరీతో కొత్త మోటోరోలా ఫోన్.. ఫీచర్లు మాత్రం కేక..!
ఈ బెనిఫిట్స్ కలిపి లెక్కిస్తే ఐఫోన్ ధర రూ.2,24,910కు చేరుతుంది. ముఖ్యంగా ఈ ఆఫర్‌ను పొందాలంటే క్రోమా ఫిజికల్ స్టోర్‌ను విజిట్ చేయాలి. ఎక్స్ఛేంజ్ వాల్యూ కార్డు అర్హత, ఆఫర్ నిబంధనలను అక్కడే చెక్ చేసుకోవడం బెటర్..
ఐఫోన్ డ్యుయో ధర ఎంత? :
భారత్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.2,99,900గా ఉంది. 512GB వేరియంట్ ధర రూ.3,24,900 కాగా, 1TB మోడల్ రూ.3,74,900కు అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్ 2TB ధర రూ.4,49,900. స్టార్ వైట్, నైట్ స్కై కలర ఆప్షన్లలో ఈ ఐఫోన్ లభిస్తుంది.
ఇక ఆపిల్ కూడా అర్హత పొందిన ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై రూ.7వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఎక్స్ఛేంజ్పై రూ.81,500 వరకు బెనిఫిట్ అందిస్తోంది.
