Apple iPhone Prices : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌‌లో భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు.. కొంటే ఐఫోన్ కొనాలి భయ్యా..!

Apple iPhone Prices : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 తగ్గింపు ధరకే కొనేసుకోండి. ఈ ధరలు రూ. 55వేల వరకు తగ్గాయి.

Apple iPhone Prices : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌‌లో భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు.. కొంటే ఐఫోన్ కొనాలి భయ్యా..!

Apple iPhone Prices

Updated On : September 22, 2025 / 7:09 PM IST

Apple iPhone Prices : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఐఫోన్ ధరలు భారీగా తగ్గాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సందర్భంగా డిస్కౌంట్ ధరకే ఐఫోన్లు లభ్యం కానున్నాయి. ఈ సేల్స్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను పొందవచ్చు. ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు కూడా తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.

ఐఫోన్ 15, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రెండూ అడ్వాన్స్ ప్రాసెసర్‌లు, ఆకట్టుకునే (Apple iPhone Prices) కెమెరా సెటప్‌లు కలిగి ఉన్నాయి. ఐఫోన్లపై రూ. 55వేల వరకు తగ్గింపు పొందాయి. అయితే, మీరు ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఈ సేల్ సీజన్ సరైన సమయం. అసలు ఆలస్యం చేయకుండా ఈ సీజన్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఐఫోన్‌ల ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ డీల్స్ :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 15 అసలు ధర రూ.69,900 నుంచి రూ.46,999కు తగ్గింది. ఆసక్తిగల వినియోగదారులు ఈ ఐఫోన్ కొనుగోలుపై అదనపు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ A16 బయోనిక్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఫస్ట్ టైమ్ ఐఫోన్ కొనేవారు లేదా తక్కువ బడ్జెట్‌లో కొనేందుకు చూసేవారికి బెస్ట్ ఆప్షన్.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే రూ. 80వేల ఫోన్ కేవలం రూ.45వేల లోపు ధరకే..!

మరో మోడల్ ఆపిల్ ఐఫోన్ 16 ధర రూ.51,999కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.79,999 కన్నా చాలా తక్కువకే లభిస్తుంది. ఈ ఐఫోన్ A18 ప్రాసెసర్‌తో వస్తుంది. అంతేకాకుండా, 48MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ.89,900కు అమ్మకానికి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.1,44,900 నుంచి తగ్గింపు పొందింది. ఈ ఐఫోన్ 8GB ర్యామ్, 6.9-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, A18 ప్రో చిప్‌సెట్‌ కలిగి ఉంది. అదేవిధంగా, ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ.1,19,900కు నుంచి రూ.69,900కు తగ్గింది. మ్యాక్స్ వేరియంట్ మాదిరిగానే కెమెరా సెటప్, స్పీడ్ ప్రాసెసర్‌ కలిగి ఉంది.