Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే రూ. 80వేల ఫోన్ కేవలం రూ.45వేల లోపు ధరకే..!

Apple iPhone 15 : సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే అమెజాన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 15 అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది.

1/6iPhone 15
Apple iPhone 15 : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? అయితే, ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకదు. ఐఫోన్ 15 తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ప్రైమ్ యూజర్ల కోసం ముందుగా అందుబాటులోకి వచ్చింది. మీరు కూడా ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే వెంటనే కొనేసుకోండి.
2/6iPhone 15
ఈ సేల్‌లో ఐఫోన్‌ 15పై లాంచ్ ధర కన్నా వేల రూపాయల తక్కువ ధరకు పొందవచ్చు. అమెజాన్ ఇప్పటికే ఐఫోన్‌లపై భారీ డీల్స్ ప్రకటించింది. గత ఏడాదిలో ఐఫోన్ 15 సిరీస్ ధర మొదటిసారిగా తగ్గింది. రూ.79,900తో లాంచ్ అయిన ఈ ఐఫోన్ మోడల్ ఇప్పుడు రూ.45వేల లోపు ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు.
3/6iPhone 15
ఐఫోన్ 15 ధర తగ్గింపు : ఆపిల్ ఐఫోన్ 15 రూ.79,900 ప్రారంభ ధరతో రాగా రూ.10వేలు తగ్గింపుతో రూ.69,900కి లభ్యమవుతుంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ అధికారిక స్టోర్ నుంచి ఐఫోన్ 15 తొలగించింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.59,900 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.
4/6iPhone 15
ఈ సేల్ సమయంలో ఐఫోన్ 15 మోడల్ రూ.43,749 ధరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత లిస్టింగ్ నుంచి రూ.17వేల కన్నా ఎక్కువ ధర పొందవచ్చు. అసలు లాంచ్ ధర నుంచి రూ.37వేల కన్నా ఎక్కువగా తగ్గింది. ఐఫోన్ 15 మోడల్ బ్లాక్, బ్లూ, గ్రీన్, గులాబీ, ఎల్లో అనే 5 కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.
5/6iPhone 15
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 15 2023లో లాంచ్ అయింది. ఐఫోన్ 15 మోడల్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే కలిగి ఉంది. బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది.
6/6iPhone 15 Price discount
48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఆపిల్ ఐఫోన్ A16 బయోనిక్ చిప్, 6GB ర్యామ్ ద్వారా పవర్ పొందుతుంది. iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. iOS 18కి అప్‌గ్రేడ్ అందుబాటులో ఉంది.