Apple Event 2026: ఫోల్డబుల్ ఐఫోన్ ధర రూ. 2 లక్షలు? గ్రాండ్ లాంచింగ్ డేట్ ఫిక్స్.. మైండ్ బ్లాకింగ్ ఫీచర్స్!
టెక్ దిగ్గజం యాపిల్ తన మోస్ట్ అంటెసిపేటెడ్ లాంచ్ ఈవెంట్(Apple Event 2026) డేట్స్ అండ్ డెటాల్స్ ను ఫిక్స్ చేసింది.
- V Santhosh Kumar
- Published on- August 27, 2026 / 12:15 PM IST
Apple launch event iphone 18 pro max and first foldable ultra price specifications
- సెప్టెంబర్ 9న ఆపిల్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్
- ఫోల్డబుల్ మోడల్ అక్షరాల రెండు లక్షలు
- ప్రో సిరీస్ కొత్త రేట్ల డీటెయిల్స్
Apple Event 2026: టెక్ దిగ్గజం యాపిల్ తన మోస్ట్ అంటెసిపేటెడ్ లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 9, 2026 న నిర్వహించనుంది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది. “సర్ప్రైజ్ అండ్ షైన్” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ ఈవెంట్‌లో, కొత్త ఐఫోన్ లైనప్‌తో పాటు కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా ఫోల్డబుల్ డివైజ్‌ను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. కొత్త సీఈఓ జాన్ టెర్నస్ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి మేజర్ ఈవెంట్(Apple Event 2026) కావడంతో టెక్ ప్రపంచంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
హై-ఎండ్ మోడల్స్, సరికొత్త ‘ఐఫోన్ ఫోల్డ్’ విశేషాలు:
ఈసారి ఫాల్ ఈవెంట్‌ను కేవలం హై-ఎండ్ డివైజ్‌లకే పరిమితం చేస్తూ యాపిల్ తన వ్యూహాన్ని మార్చింది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్‌తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఐఫోన్ ఫోల్డ్’ (అల్ట్రా) లాంచ్ కానుంది. ముఖ్యంగా ఫోల్డబుల్ ఫోన్‌లో స్క్రీన్ క్రీజ్‌ను పూర్తిగా తొలగించేందుకు లిక్విడ్ మెటల్ హింజ్, ఇన్-సెల్ టచ్ ప్యానెల్‌ను ఉపయోగించారు. శక్తివంతమైన 2nm A20 ప్రో ప్రాసెసర్, C2 మోడెమ్‌తో వస్తున్న ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ డివైజ్ కోసం యాపిల్ ఏకంగా 10 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం.
మోడల్స్ అంచనా ధరలు, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు:
ఈ ఫాల్ ఈవెంట్‌లో పరిచయం కానున్న ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర సుమారు $1,099 అనగా భారత్‌లో రూ. 1,39,900 కాగా, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర $1,199 అనగా భారత్‌లో రూ. 1,69,990 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఈవెంట్‌కే ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ‘ఐఫోన్ ఫోల్డ్(Iphone Foldable Ultra)’ ప్రారంభ ధర సుమారు $1,999 అనగా భారత్‌లో దాదాపు రూ. 1,99,990 దాకా ఉంటుందని అంచనా.
స్టాండర్డ్ మోడల్స్ వాయిదా – గ్లోబల్ టెలికాస్ట్ వివరాలు:
సాధారణ ఐఫోన్ 18 సిరీస్‌ను ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది స్ప్రింగ్ లాంచ్ విండోకు మార్చారు. త్వరలో రానున్న ఆ మోడల్స్‌తో పాటు సెకండ్ జనరేషన్ ఐఫోన్ ఎయిర్, ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 18ఈ కూడా రిలీజ్ కానున్నాయి. ఇక సెప్టెంబర్ 9న రాత్రి 10:30 గంటలకు (IST) ప్రారంభమయ్యే ఈ లాంచ్ ఈవెంట్‌ను యాపిల్ అధికారిక వెబ్‌సైట్, యాపిల్ టీవీ యాప్ మరియు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైవ్‌లో వీక్షించవచ్చు.
