Apple New iPad Mini : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ వస్తోందోచ్.. ఫుల్ డిటెయిల్స్!
Apple New iPad Mini : ఆపిల్ సెప్టెంబర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఐఫోన్ 18 ప్రోతో పాటు, 2021 తర్వాత భారీ అప్‌గ్రేడ్‌గా ఓఎల్ఈడీ డిస్ప్లేతో సరికొత్త ఐప్యాడ్ మినీని తీసుకువస్తోంది.
Apple New iPad Mini
Apple New iPad Mini : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఈ సెప్టెంబర్‌లో కొత్త రేంజ్ ప్రొడక్టులను లాంచ్ చేసేందుకు ఆపిల్ రెడీ అవుతోంది. బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ రిపోర్టు ప్రకారం ఆపిల్ ఓల్ఈడీ డిస్ప్లేతో సరికొత్త ఐప్యాడ్ మినీ లాంచ్ చేయనుంది. ఈ డిస్ప్లే కాంపాక్ట్ ఆపిల్ టాబ్లెట్లలో అతిపెద్ద మార్పుగా చెప్పొచ్చు.
లేటెస్ట్ ఐప్యాడ్ మినీ ఇంటర్నల్ J510 అనే కోడ్‌నేమ్‌తో వస్తుంది. 2021 తర్వాత టాబ్లెట్‌లో ఫస్ట్ మెయిన్ అప్‌గ్రేడ్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో రానుంది. అలాగే, ఫస్ట్ నాన్-ప్రో ఐప్యాడ్ కూడా ఇదే కానుంది. ఆపిల్ నుంచి రాబోయే ఈ టాబ్లెట్ కోసం డిజైన్‌కు సంబంధించిన మిగతా అన్ని ఫీచర్లు యథాతథంగా ఉండనున్నాయి.
ఆపిల్ J581 అనే కోడ్‌నేమ్‌తో కొత్త ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌ను కూడా లాంచ్ చేయబోతోందని పుకార్లు వినిపిస్తున్నాయి. హై కంప్యూట్ పవర్‌తో సరికొత్త ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. కానీ, ఆపిల్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
లీకులను పరిశీలిస్తే.. :
2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఐప్యాడ్ ఎయిర్ కూడా J807, J837 అనే కోడ్‌నేమ్‌లతో 11-అంగుళాల 13-అంగుళాల స్క్రీన్ సైజులలో కొత్త వేరియంట్లను అందించనుంది. బహుశా కొత్త ఐప్యాడ్ ప్రో వేరియంట్లతో పాటు లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది.
Read Also : Poco M8 Power : పోకో నుంచి రెండు కొత్త ఫోన్లు.. ఈసారి రేంజ్ వేరబ్బా! ఫీచర్లు, ధరపై భారీ హైప్!
ఐప్యాడ్ ఎయిర్‌కు కూడా ఓఎల్ఈడీ టెక్నాలజీని అందించాలని ఆపిల్ యోచిస్తోందని గుర్మాన్ పేర్కొన్నారు. అయితే, ధరలు భారీగా పెరగకుండా ఉండేలా సాధారణ ఐప్యాడ్ ప్రస్తుత ఎల్సీడీ డిస్ప్లేతోనే కొనసాగే అవకాశం ఉంది. ఈ టాబ్లెట్ అప్డేట్తో పాటు రెండు కొత్త ఆపిల్ పెన్సిల్ మోడళ్లను కూడా లాంచ్ చేయాలని ఆపిల్ యోచిస్తోందని తెలిపారు.
ఎంట్రీ లెవల్ USB-C పెన్సిల్, ఆపిల్ పెన్సిల్ ప్రో లేటెస్ట్ డిజైన్ మారనుంది. యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగా బ్యాటరీ మార్పిడి కూడా ఉంటుంది. ఈ రెండు వేరియంట్లు అప్‌గ్రేడ్ బ్యాటరీ డిజైన్‌తో వస్తాయని భావిస్తున్నారు.
