Poco M8 Power : పోకో నుంచి రెండు కొత్త ఫోన్లు.. ఈసారి రేంజ్ వేరబ్బా! ఫీచర్లు, ధరపై భారీ హైప్!
Poco M8 Power : పోకో నుంచి రెడ్మి నోట్ 17, రెడ్మి నోట్ 17 ప్రోలకు రీబ్రాండెడ్ వెర్షన్లుగా పోకో ఎం8 పవర్, పోకో ఎక్స్8 అనే 2 కొత్త స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.
Poco M8 Power
- పోకో కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్
- మిడ్‌రేంజ్ మార్కెట్‌కు పోకో సవాల్..
- ఈ కొత్త ఫోన్లలో స్పెషాలిటీ ఏంటంటే?
Poco M8 Power : పోకో లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లో రెండు కొత్త ఫోన్లు రానున్నాయి. లీక్ ప్రకారం.. షావోమీ సబ్-బ్రాండ్ పోకో రాబోయే వారాల్లో పోకో M8 పవర్, పోకో X8 ఫోన్లను లాంచ్ చేయనుంది.
ఈ రెండు ఫోన్లు ఇటీవల లాంచ్ అయిన రెడ్మి నోట్ 17, రెడ్మి నోట్ 17 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్లుగా చెప్పవచ్చు. పోకో బ్రాండింగ్‌తో పాటు హార్డ్‌వేర్‌తో రానున్నాయని అంచనా. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ వివరాలను అధికారికంగా వెరిఫై చేయలేదు. రాబోయే ఈ పోకో స్మార్ట్ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
పోకో ఎం8 పవర్, పోకో ఎక్స్8 లాంచ్ టైమ్ లీక్ :
టిప్‌స్టర్ ప్రకారం.. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ప్రస్తుత త్రైమాసికంలో భారత మార్కెట్లో పోకో M8 పవర్, పోకో X8 ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. కచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా రివీల్ చేయలేదు. ఈ స్మార్ట్ఫోన్లు రాబోయే కొన్ని వారాలు లేదా నెలల్లో మార్కెట్లోకి రావచ్చని టైమ్‌లైన్ సూచిస్తోంది.
ఈ లీక్ ప్రకారం.. ఈ 2 ఫోన్లు కూడా చైనాలో లాంచ్ అయిన రెడ్మి నోట్ 17, రెడ్మి నోట్ 17 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్లేనని తెలుస్తోంది. చైనాలోని రెడ్మి వేరియంట్లతో పోలిస్తే.. భారతీయ వేరియంట్ల ధర ఎక్కువగా ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
స్పెసిఫికేషన్లు ధర (అంచనా) :
పోకో M8 పవర్ హార్డ్‌వేర్ రెడ్మి నోట్ 17 మాదిరిగానే ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రెడ్మి ఫోన్ ఈ నెల ప్రారంభంలో చైనాలో లాంచ్ అయింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర CNY 1,299 (సుమారుగా రూ. 18వేలు) ఉంటుంది.
ఈ హ్యాండ్సెట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది. భారీ 8000mAh బ్యాటరీతో వస్తుంది. మార్కెట్‌ను బట్టి పోకో M8 పవర్, పోకో X8 వేర్వేరు స్నాప్‌డ్రాగన్ చిప్సెట్లతో రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి
