Best Camera Phones : వావ్.. రూ.20 వేలలో అదిరిపోయే కెమెరా ఫోన్లు.. ఈ 4 ఫోన్లతో ఫొటోలు, వీడియోలు ఇరగదీయొచ్చు!
Best Camera Phones : రూ.20 వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో, మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, మోటో జీ96, రెడ్‌మి నోట్ 14 5జీ ఫీచర్లు, కెమెరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- November 9, 2026 / 02:19 PM IST
Best Camera Phones Under Rs 20K
- మంచి ఫొటోలు తీయాలంటే లక్షలు పెట్టక్కర్లేదు
- బడ్జెట్‌లో బెస్ట్ కెమెరా ఫోన్ కావాలా?
- 2026లో ఈ నాలుగు మోడల్స్ ట్రై చేయండి
Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఇప్పుడు చాలామంది ముందుగా చూసేది కెమెరానే.. మంచి ఫొటోలు తీసేందుకు భారీగా డబ్బులు పెట్టి ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కొనాల్సిన పనిలేదు..
రూ.20 వేల లోపు బడ్జెట్‌లోనే 50MP కెమెరాలు, OIS వంటి ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రతి ఫోన్‌లోనూ అన్ని రకాల ఫొటోగ్రఫీ ఫీచర్లు ఒకేలా ఉండవు. మీ ఫొటోగ్రఫీ అవసరాలను బట్టి సరైన ఫోన్ ఎంచుకోవడం బెటర్.. ఈ టాప్ 4 ఫోన్లలో మీకు ఏది కావాలో కొనేసుకోండి..
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో :
జూమ్ ఫొటోలు, పోర్ట్రెయిట్లు ఎక్కువగా తీసేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్.. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. 2x ఆప్టికల్ జూమ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది..
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
ఓవరాల్‌గా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ కావాలనుకునేవారు ఈ ఫోన్‌ను కొనేసుకోవచ్చు.. ఇందులో 50MP OIS మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరా కూడా స్పెషల్ అట్రాక్షన్.. 5500mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు..
Read Also : Car Hacking Alert : మీ కారు సేఫ్‌గానే ఉందా? ఈ ఒక్క చిన్న పొరపాటుతో హ్యాకర్ల చేతుల్లోకి.. సేఫ్టీ కోసం ఇలా..!
మోటో జీ96 5జీ :
వీడియోలు ఎక్కువగా షూట్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.. 50MP OIS మెయిన్ కెమెరా ఉండటంతో మూవింగ్ వీడియోలు తీసేటప్పుడు స్టేబిలిటీ అందిస్తుంది. 144Hz pOLED డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ఉన్నాయి.
రెడ్‌మి నోట్ 14 5జీ :
తక్కువ ధరలో మంచి డే లైట్ ఫొటోగ్రఫీ కోరుకునేవారికి ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది. 50MP సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌తో పాటు OIS, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో కెమెరాలు ఇందులో ఉన్నాయి..
ఏ ఫోన్ కొనాలి? :
జూమ్ కోసం సీఎంఎఫ్ ఫోన్, ఓవరాల్ కెమెరా కోసం మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, వీడియోల కోసం మోటో జీ96, తక్కువ ధరలో ఫొటోగ్రఫీ కోసం రెడ్‌మి నోట్ 14 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు.. అయితే ఈ ఫోన్లలో ఏదైనా కొనే ముందు లేటెస్ట్ ధరలు, కెమెరా శాంపిల్స్, యూజర్ రివ్యూలు కూడా చెక్ చేయండి..
