×
Ad

Black Friday Sale : విజయ్ సేల్స్ బ్లాక్ ఫ్రైడే సేల్‌.. ఈ ఐఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఆపిల్ లవర్స్ డోంట్ మిస్..!

Black Friday Sale : విజయ్ సేల్స్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ సందర్భంగా ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వరకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

1/5
Black Friday Sale : ఆపిల్ లవర్స్ పండగ చేస్కోండి.. విజయ్ సేల్స్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ మొదలైంది.. ఈ ప్లాట్‌ఫామ్‌లో టీవీలు, ఆడియో ప్రొడక్టులు, ల్యాప్‌టాప్‌లతో పాటు అనేక స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి ఐఫోన్ డీల్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. మీరు కూడా ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ సమయంలో పాత ఐఫోన్ 13 మోడల్స్ నుంచి లేటెస్ట్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీ బడ్జెట్ ధరలోనే మీకు నచ్చిన ఐఫోన్ మోడల్ కొనేసుకోవచ్చు. విజయ్ సేల్స్‌ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఐఫోన్ 13, ఐఫోన్ 15పై మరిన్ని డిస్కౌంట్లను పొందవచ్చు.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
2/5
చౌకైన ధరకే ఐఫోన్ 13 : విజయ్ సేల్స్ బ్లాక్ ఫ్రైడ్ సేల్ సమయంలో ఐఫోన్ 13 మోడల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఆపిల్ ఐఫోన్ 13 అసలు ధర రూ.49,900 ఉండగా ఇప్పుడు ధర రూ.44,990కు లభిస్తోంది. అంటే.. నేరుగా రూ.5వేలు తగ్గింపు పొందవచ్చు. మీరు ఐసీఐసీఐ లేదా ఎస్బీఐ బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు ఐఫోన్ 13 అసలు ధర నుంచి రూ.39,900కి తగ్గుతుంది. ఈ ఐఫోన్ 13 పాత మోడల్ అయినా రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది.
3/5
ఐఫోన్ 15 ధర తగ్గింపు : ఐఫోన్ 15 సేల్ సమయంలో రూ.55,690కి లభ్యమవుతుంది. అసలు ధర రూ.59,900 కన్నా తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 15 ధర రూ.4,210 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ వంటి అదే బ్యాంక్ కార్డులతో మరో రూ.2వేలు తగ్గింపు పొందవచ్చు. దాంతో ఐఫోన్ 15 ధర రూ.53,690కి తగ్గుతుంది. ఐఫోన్ 15 ఫీచర్ల విషయానికి వస్తే.. డిస్‌ప్లే, కెమెరాలు, మోడ్రాన్ USB-C పోర్ట్‌ కలిగి ఉంది. ఐఫోన్ 13 కన్నా అద్భఉతమైన ఫీచర్లను కలిగి ఉంది. కొంచెం బడ్జెట్ ఎక్కువ అయినప్పటికీ ఈ ఐఫోన్ 15 ఇంటికి తెచ్చుకోవచ్చు.
4/5
ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్ : ఐఫోన్ 16పై కూడా డిస్కౌంట్ అందిస్తోంది. విజయ్ సేల్స్ అసలు ధర రూ.69,900 ఉండగా రూ.66,490కు అందిస్తోంది. రూ.3,410 నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు. అర్హత కలిగిన బ్యాంక్ కార్డులతో కస్టమర్లు అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 16 ధర రూ.62,490కు సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్ మార్కెట్లో లిమిటెడ్ ఆఫర్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. లేటెస్ట్ హార్డ్‌వేర్‌ను కోరుకునే యూజర్లకు ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది.
5/5
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఆఫర్లు : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌పై డైరెక్ట్ డిస్కౌంట్ లేదు. అసలు ధర రూ. 1,49,900 అలాగే ఉంది. అయితే, మీరు HSBC క్రెడిట్ కార్డ్ ఈఎంఐ హోల్డర్ అయితే బ్యాంక్ ఆఫర్లతో రూ. 7,500 వరకు తగ్గింపు పొందవచ్చు. HDFC కస్టమర్లు రూ. 4,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఎస్బీఐ, ఐసీఐసీఐ కస్టమర్లు రూ. 4వేల వరకు తగ్గింపు పొందవచ్చు.