BSNL Cheapest Plan : యూజర్లకు పండగే.. రోజూ 2GB డేటా కావాలా? BSNL 72 రోజుల చౌకైన ప్లాన్ ఇదే!
BSNL కస్టమర్లకు రూ. 500 కన్నా తక్కువ ధరకే 72 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటాను అందిస్తుంది.
- Sreehari A
- Published on- August 23, 2026 / 03:31 PM IST
BSNL Cheapest Plan
- BSNL రీచార్జ్‌లో అదిరిపోయే ఆఫర్..
- మీ దగ్గర సిమ్ ఉంటే ఈ ప్లాన్ మిస్ అవ్వకండి
- తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ రీచార్జ్..
- ఎన్ని రోజుల వ్యాలిడిటీ, డేటా ఎంత?
BSNL Cheapest Plan : BSNL కస్టమర్లకు పండగే.. అత్యంత చౌకైన ప్లాన్ వచ్చేసింది. 72 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ప్రైవేట్ టెల్కోలు తక్కువ ధర ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేస్తుండగా BSNL మాత్రం తక్కువ ధరకే ఎక్కువ వ్యాలిడిటీతో ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ సరసమైన రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 500 కన్నా తక్కువే. ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. పూర్తి ప్లాన్,వ్యాలిడిటీ, ధర వివరాలపై ఓ లుక్కేయండి..
చౌకైన 72-రోజుల ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 485 మాత్రమే. భారత్ అంతటా (BSNL Cheapest Plan) అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్, ఫ్రీ నేషనల్ రోమింగ్ ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులు ఉంటుంది. వినియోగదారులకు ప్రతిరోజూ 100 ఫ్రీ SMS, 2GB డేటా లభిస్తుంది. మొత్తంగా 144GB డేటాను పొందవచ్చు.
ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ. 1 ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. అయితే, గత ఏడాది అందించిన బెనిఫిట్స్ మాత్రం కంపెనీ మార్చింది. ఈ BSNL ఆఫర్ సెప్టెంబర్ 12, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా కొత్త BSNL కస్టమర్లకు కోసం అందిస్తోంది.
బెనిఫిట్స్ విషయానికి వస్తే..
ఈ రూ. 1 ప్లాన్‌తో కస్టమర్లకు 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అదనంగా, దేశమంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ అందుకుంటారు. ఈ ప్లాన్‌తో పాటు ప్రతిరోజూ 100 ఫ్రీ ఎస్ఎంఎస్, 1GB డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
గత ఏడాదిలో 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 1 ప్లాన్‌ను ప్రారంభించింది. అంతేకాదు.. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాను అందించింది. ఈ కొత్త ప్లాన్‌లో కంపెనీ వ్యాలిడిటీతో పాటు ఫ్రీ డేటాను కూడా తగ్గించింది.
బీఎస్ఎన్ఎల్ లక్షలాది కస్టమర్ల కోసం మరో ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది. తద్వారా రూ. 2,399 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌పై 47 రోజుల అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వినియోగదారులు ఇప్పుడు మొత్తం 412 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అంతేకాదు.. ఈ ప్లాన్‌లో అన్ని బెనిఫిట్స్ కూడా 412 రోజుల పాటు లభిస్తాయి.
